హోటల్స్​.. రెస్టారెంట్లపై ఫుడ్​ సేఫ్టీ అధికారులు నాన్​ స్టాప్​ దాడులు

హోటల్స్​.. రెస్టారెంట్లపై ఫుడ్​ సేఫ్టీ అధికారులు నాన్​ స్టాప్​ దాడులు

హైదరాబాద్‌లో గ్రేటర్ హోటల్స్, రెస్టారెంట్స్ పై  ఫుడ్ సేఫ్టీ అధికారులు  నాన్ స్టాప్ దాడులు దాడులు నిర్వహిస్తున్నారు.  ఇప్పటికే పలు హోటల్స్ లో  ఆకస్మిక తనిఖీలు చేసిన అధికారులు ఆహార భద్రత విషయంలో జాగ్రత్తలు పాటించని పలు హోటల్స్ లైసెన్స్ లను రద్దు చేశారు.  తాజాగా  లకిడికపూల్ లోని పలు రెస్టారెంట్లను.. హోటల్స్​ ను  ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. షాహీ దస్తర్ ఖాన్, బడే మియా కబాబ్స్, ఖాన్ ఈ ఖాస్ రెస్టారెంట్లు ఆహార భద్రతా నియమాలు  పాటించట్లేదని  అధికారులు గుర్తించారు.  ఇంకా  కబాబ్ తో పాటు నాన్ వెజ్ ఐటమ్స్ లో సింథటిక్ ఫుడ్ కలర్స్ కలిపి.. కస్టమర్ల ప్రాణాలతో హోటల్స్​ యజమానులు చెలగాటమాడుతున్నారు.

Also Read : స్కూళ్లలో టీచర్స్, స్టూడెంట్స్​ కమిటీలు వేస్తాం

ఇక కిచెన్​ పరిశ్రుభ్రత విషయంలో ఆ ప్రదేశంలో విచ్చలవిడిగా బొద్దింకలు.. ఎలుకలు తిరుగుతున్నాయ ని.. గడువు ముగిసిన రా మెటీరియల్​ తో తినుబండారాలను.. బ్రేక్​ ఫాస్ట్​ ఐటమ్స్​ ను తయారు చేస్తున్నట్లు ఫుడ్​ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఎక్స్పైర్ అయిన మ్యాంగో మిల్క్, కోకోనట్ మిల్క్, కొరియా వాటర్ వాడుతున్నారు.  మిగిలిపోయిన ఫుడ్ ను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి నెక్స్ట్ డే సర్వ్ చేస్తున్నట్లు  అధికారులు తెలిపారు. స్టోర్ రూమ్ లో ఫంగస్ వచ్చిన అల్లంను కనుగొన్నారు. ఆహార పదార్థాల్లో మోతాదుకు మించి ఫుడ్ కలర్స్ వినియోగించడంపై హోటల్స్, రెస్టారెంట్ల నిర్వాహకులకు ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు ఇచ్చారు.ఆహార భద్రత విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే క్రిమినల్ కేసులు పెడతామంటూ హెచ్చరించారు.