
పిట్లం, వెలుగు : అగ్ని ప్రమాదంలో పెంకుటిల్లు దగ్ధమైంది. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి బిచ్కుందలో పత్తి నగేశ్‌కు చెందిన ఇంట్లో ప్రమాదవ శాత్తు అగ్ని ప్రమాదం జరిగి రూ.5 లక్షల వరకు నష్టం జరిగిందని తెలిపాడు. విషయం తెలుసుకున్న ఎస్సై మోహన్‌రెడ్డి మద్నూర్ అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు మంటలను ఆర్పివేశారు.