పోన్కుర్ గ్రామంలో షార్ట్ సర్క్యూట్​తో ఇంట్లోని వస్తువులు దగ్ధం

సారంగాపూర్, వెలుగు: షార్ట్​సర్క్యూట్​కారణంగా ఓ ఇంట్లోని సామగ్రి మొత్తం కాలిపోయింది. ఈ ఘటన సారంగాపూర్ మండలంలోని పోన్కుర్ (స్వర్ణ) గ్రామంలో గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన అచ్చ రాజేశ్వర్ కుటుంబసభ్యులు ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లారు. మధ్యాహ్నం 12.45 గంటల సమయంలో ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

స్థానికులు పక్కనే ఉన్న బోరు పంపుతో నీళ్లు పట్టి మంటలు ఆర్పారు. విషయం తెలుసుకున్న యజమానికి వచ్చి చూసేసరికి ఇంట్లోని వస్తువులు,బియ్యం, బట్టలు, కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న రెవెన్యూ ఇన్​స్పెక్టర్ ​వెంకట నర్సయ్య సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి పంచనామా చేశారు.  రూ.1 లక్షా 20 వేల ఆస్తినష్టం జరిగిందని అంచనా వేశారు.