గుడిహత్నూర్, వెలుగు: గుడిహత్నూర్ మండలంలోని మల్కాపూర్‌లో శుక్రవారం ఓ ఇల్లు షార్ట్‌సర్క్యూట్‌తో దగ్ధమైంది. మల్కాపూర్ కు చెందిన మడావి దశరథ్ కుటుంబసభ్యులతో పెంకు ఇంటిలో ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం దశరథ్ ఇంటి బయట మంచంలో పడుకుని ఉండగా ఆయన భార్య మంచి నీటి కోసం బోరుబావి వద్దకు వెళ్లింది.
అదే సమయంలో ఇంటిలోపల షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు, పొగ వెలువడ్డాయి. గమనించిన గ్రామస్తులు మంటలను ఆర్పివేశారు. ఇంట్లో ఉన్న ఆహార ధాన్యాలు, ఇతర వస్తువులు పూర్తిగా దగ్ధమైనట్లు బాధితులు తెలిపారు. దాదాపు రూ. 2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని, తనను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. విషయం తెలుసుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.5 వేల నగదు అందజేశారు.