వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని పూజగది అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. పూజగదికి సంబంధించిన కొన్ని ప్రత్యేక వాస్తు నియమాలను పాటించడం ద్వారా ఇంట్లో సానుకూల శక్తిని పెంచుకోవచ్చు. ఇంట్లో సరైన స్థలంలో సరైన దిశలో పూజ కోసం గదిని నిర్మించడం శుభ ఫలితాలను తెస్తుంది. ఇంటికి ఆనందం, సుఖ శాంతులు లభిస్తాయి. కుటుంబ సభ్యులందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు.
పూజ గది వాస్తు:
ఇంట్లో పూజ కోసం గదిని నిర్మించేటప్పుడు, దిశపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటిలో పూజా స్థలం ఈశాన్య దిశలో లేదా ఈశాన్య మూలలో ఉండటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. దీంతో ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతారు. వాస్తు ప్రకారం, సంతోషం, అదృష్టాన్ని పెంచడానికి పూజ చేసేటప్పుడు ముఖం ఎల్లప్పుడూ తూర్పు వైపు ఉండాలి. పడమర ముఖంగా పూజించడం వల్ల సంపద పెరుగుతుంది. అదే సమయంలో దక్షిణాభిముఖంగా పూజలు చేయకూడదని నమ్మకం. దీని వల్ల అశుభ ఫలితాలు రావచ్చు. సాధ్యమైనంత పూజ స్థలం ఈశాన్యంలోనే ఉండాలి. అలా కుదరని పక్షంలో ఒకవేళ మార్చుకుంటే పడమర వాయువ్యం వైపు పెట్టుకోవాలి. కానీ దేవుడి ఫేసింగ్ తూర్పు వైపు ఉండేలా తగిన మార్పులు చేసుకోవాలి. వాస్తు ప్రకారం ప్రధాన ద్వారం ముందు, మరుగుదొడ్డి దగ్గర, మెట్ల క్రింద ఎప్పుడూ పూజామందిరం నిర్మించకూడదు. అలా చేయడం అశుభంగా భావిస్తారు. ఇది జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
ఇంటికి ఎన్ని డోర్లు ఉండాలి
వాస్తు శాస్త్రంలో( Vastu ) ఇంటి ద్వారాలకు ప్రత్యేక స్థానం ఉంది అన్న విషయం దాదాపు చాలామందికి తెలుసు.అయితే వాస్తు శాస్త్రంలో ఇంటికి ఎన్ని ద్వారాలు( Doors ) ఉండాలి అన్న విషయాన్ని కూడా వెల్లడించారు. కానీ చాలామంది ఈ విషయాన్ని తేలికగా తీసుకుంటూ ఉంటారు.కానీ వాస్తు శాస్త్రాన్ని నమ్మేవారు మాత్రం ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా చెప్పాలంటే అద్దె ఇల్లు అయినా సొంత ఇల్లు అయినా శుభసంఖ్యలో ద్వారాలు ఉండాలని, శాస్త్రీయ పరంగా ద్వారలకు ఒక విశిష్ట స్థానం ఉందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇంటి ద్వారాలను సరి సంఖ్యలో ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. బేసి సంఖ్య ద్వారాలు ఉండకూడదు. - సరి సంఖ్య ప్రకారమే ఇంటికి డోర్లు ఉండాలి. అంటే రెండు, నాలుగు, ఆరు, ఎనిమిది ఇలా సంఖ్యలో డోర్లు ప్లాన్ చేసుకోవాలి. వాస్తు ప్రకారం మూడు, ఐదు, ఏడు డోర్లు ఉండకూడదు. కాబట్టి రెండు లేదా నాలుగు అంతకంటే ఎక్కువదోర్లు ఉండేలా ప్లాన్ చేసుకోవచ్చు.
శుభసంఖ్యలో ద్వారాలు ఉండడం వల్ల ఇంట్లో( House ) నివసించే వారికి మంచి ఫలితాలు వస్తాయి.అదే శాస్త్రానికి విరుద్ధంగా ద్వారాలు ఉంటే అశాంతి కలిగించే ఫలితాలు వస్తాయి.మనం నివసించే ఇంటిలో రెండు ద్వారాలు( Two Doors ) ఉంటే ఎంతో మంచిది.రెండు ద్వారాల ఇంటిలో నివసించే వ్యక్తులు శ్రేష్టమైన జీవన అభివృద్ధి కలుగుతుంది.అదే నాలుగు ద్వారాలు ఉన్న గృహంలో నివసించే వ్యక్తులకు ఆయువు, ఆరోగ్యాలను కలిగి వారి కృషికి తగిన ఫలితం లభిస్తుంది.అంతేకాకుండా సమాజంలో వారి కంటూ ఒక ప్రత్యేక గౌరవం ఏర్పడి మంచి గుర్తింపు లభిస్తుంది.ఆరు ద్వారాలు ఉన్న ఇల్లు పుత్ర వృద్ధి, శ్రేయస్సు ఐశ్వర్యము కలుగుతుంది.ఇంకా చెప్పాలంటే ఎనిమిది ద్వారాలు( Eight Doors ) ఉన్న గృహంలో నివసించే వారు సకల భోగభాగ్యాలు కలిగి అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో ఉంటారు.12 ద్వారములు గల ఇల్లు ఉద్యోగ వ్యాపారంలో మంచి అభివృద్ధిని కలిగించి మంచి కీర్తి ప్రాప్తిస్తుంది.14 ద్వారములు ఉన్న ఇల్లు కుటుంబ వృద్ధి, ధన సంపదను కలిగిస్తుంది.16 ద్వారములు గల ఇల్లు అన్నిటిలో విజయం లభిస్తుంది.ఐదు ద్వారములు ఉన్న ఇల్లు అనారోగ్య సమస్యలను, సంతానానికి కీడును శత్రువుల నుంచి ఇబ్బందులను కలిగిస్తుంది.
రాశి ప్రకారమే ఇల్లు కట్టుకోవాలా..
గృహనిర్మాణం చేసేటప్పుడు తప్పని సరిగా ప్రతి ఒక్కరూ ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. మన జీవిత కాలం కన్నా మనం నిర్మించిన ఇల్లు లేదా ఏదైనా కట్టడం ఎక్కువకాలం మన్నుతుంది. కాబట్టి మన తరువాత ఆ నిర్మాణం లో జీవించబోయేవారి సుఖశాంతులను కూడా దృష్టి లో పెట్టుకుని నిర్మాణాలను చేపట్టాలి.
ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లు ఒక్కొక్కసారి కలిసి రాకుండా పోతుంది. సంవత్సరాల పాటు కష్టపడి నిర్మించుకున్న కలల సౌధంలో వారు సంతోషకరమైన జీవితాన్ని అనుభవించలేరు. ఆ ఇల్లు వారికి నష్టాలను కలుగజేస్తుంది. పూజలు చేసినా, ఎన్ని శాంతులు హోమాలు జరిపించినా, పరిస్థితులు చక్కబడవు. అయితే ఇల్లు నిర్మించుకునే వారికి అది రాశుల ప్రకారం ఏ ముఖద్వారం ఉన్న ఇల్లు మంచిదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది
- ద్వాదశ రాశులలో మొదటి రాశి అయిన మేషరాశిలో పుట్టిన వారికి తూర్పు ముఖద్వారం గలిగిన ఇల్లు బాగా కలిసి వస్తుంది.
- వృషభ రాశి వారికి దక్షిణ ముఖద్వారం గల ఇల్లు బాగా కలిసి వస్తుంది.
- మిధున రాశి వారికి పశ్చిమ ముఖద్వారం గల ఇల్లు బాగా కలిసి వస్తుంది.
- కర్కాటక రాశి వారికి ఉత్తర ముఖంగా ఉన్న ఇల్లు బాగా కలిసి వస్తుంది.
- సింహ రాశి వారికి తూర్పు అభిముఖంగా ఉన్న ఇల్లు బాగా కలిసి వస్తుంది.
- కన్యా రాశి వారికి పశ్చిమ ముఖద్వారంగా గల ఇల్లు కలిసి వస్తుంది.
- తులా రాశి వారికి దక్షిణ ముఖద్వారం కలిగిన ఇల్లు బాగా కలిసి వస్తుంది.
- వృశ్చిక రాశి వారికి ఉత్తర ముఖ ద్వారం కలిగిన ఇల్లు బాగా కలిసి వస్తుంది.
- ధనుస్సు రాశి వారికి తూర్పు ముఖద్వారం ఉన్న ఇల్లు బాగా కలిసి వస్తుంది.
- మకర రాశి వారికి దక్షిణ ముఖద్వారం గలిగిన ఇల్లు బాగా కలిసి వస్తుంది.
- కుంభ రాశి వారికి పశ్చిమ ముఖద్వారం గలిగిన ఇల్లు బాగా కలిసి వస్తుంది.
- మీన రాశి వారికి ఉత్తర ముఖద్వారం కలిగిన ఇల్లు బాగా కలిసి వస్తుంది.
ముఖ ద్వారాన్ని నిర్మించ లేనప్పుడు మీ రాశికి సరిపడే దిక్కున ఒక కిటికీ నైనా అమర్చితే సరిపోతుంది. తూర్పు మరియు ఉత్తర ద్వారాలు ఏ రాశి వారికి అయినా ఉత్తమమైనవి అని చెప్పవచ్చు. దక్షిణ మరియు పశ్చిమ ద్వారాలు అవి సరిపడే రాశుల వారికి తప్ప మరొకరికి మంచి జరగదని చెబుతున్నారు.