
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీరోలులో మూడు నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విజయమ్మ అనే మహిళ ఇంటి గోడలు పూర్తిగా కూలిపోయాయి. ఆ సమయంలో ఆమె ఇంట్లోనే ఉండటంతో స్వల్ప గాయాలయ్యాయి. ఇంటి గోడలు మట్టితో నిర్మించినవి కావడంతో వర్షానికి పూర్తిగా తడిచి కూలినట్లు స్థానికులు చెబుతున్నారు. నిరుపేద మహిళ కావడంతో తనకు సహాయం అందించాలని విజయమ్మ కోరుతోంది.