Vastu Tips: ఇంటి ఫేసింగ్​ ఏ దిక్కులో ఉండాలి.. తూర్పు ఫేసింగ్​ లేకపోతే ఇబ్బందులు ఉంటాయా?

Vastu Tips:   ఇంటి ఫేసింగ్​ ఏ దిక్కులో ఉండాలి.. తూర్పు ఫేసింగ్​ లేకపోతే ఇబ్బందులు ఉంటాయా?

రియల్​ ఎస్టేట్​ వ్యాపారం చేసే వాళ్లు ప్లాట్లు.. ఇళ్లు అమ్మేటప్పుడు చాలా ఇబ్బందులు పడుతుంటారు. కష్టమర్స్​ వస్తుంటారు.. కాని చాలామంది తూర్పు ఫేసింగ్​ కావాలంటారు.  అందరికి అది సాధ్యపడదు కదా.. అన్ని దిక్కుల ఫేసింగ్​ లో ఇళ్లు .. ప్లాట్లు ఉంటాయి.. తూర్పు ఫేసింగ్​ గల ఇంట్లో ఉండకపోతే  వాస్తు ప్రకారం ఏమైనా ఇబ్బందులు ఉంటాయా.  ఒక రియల్​ ఎస్టేట్​ వ్యాపారి అడిగిన ప్రశ్నకు వాస్తు సిద్దాంతి కాశీనాథుని శ్రీనివాస్​ గారు చెబుతున్న సూచనలను ఒకసారి చూద్దాం. . 

ప్రశ్న:  నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాను. పాటు, ఫ్లాట్లు కమీషన్ మీద అమ్మి పెడుతుంటాను. అయితే నా దగ్గరకు వచ్చే చాలామంది 'మాకు తూర్పు ముఖం ఉన్న ప్లాటే కావాలి' అంటున్నారు. కొందరైతే దక్షిణం దిక్కు అంటేనే... 'వద్దు.. వద్దు" అంటున్నారు. అసలు దిక్కుల్లో మంచివి, చెడ్డవి అని ఉంటాయా? వాస్తు ప్రకారం ఏదిక్కుల్లో ఉన్న ప్లాట్లు మంచివి? వీటికి సంబంధించి ఇంకేం నిబంధనలు ఉంటాయి..

జవాబు:  సాధారణంగా అన్ని దిక్కులూ మంచివే. కాకపోతే 'ఒక్కొక్కరి పేరు మీద ఒక్కో దిక్కు కలిసి వస్తుంది. మరికొందరికి కొన్ని దిక్కులు కలిసిరాక దివాలా తీస్తారు. ఇలాంటి నిబంధనలు వాస్తులో ఉంటాయి. కాకపోతే అందరికీ తూర్పు ముఖమే మంచిదని ఎక్కడా లేదు. దక్షిణం దిక్కు కూడా చాలామందికి కలిసి వస్తుంది. దానివల్లే బాగుపడే వాళ్లు ఉంటారు. దిక్కుల్లో మంచివి. చెడ్డవి అని ఉండవు. అలా అనుకోవడం చాలా తప్పు. కాకపోతే అవగాహన లోపం వల్ల తూర్పు ఒక్కటే మంచిది అనుకుంటున్నారు.