భైంసా, వెలుగు: భైంసా మండలం హజ్గుల్గ్రామానికి చెందిన ఆనందబాయి అనే మహిళ ఇల్లు షార్ట్‌సర్క్యూట్‌తో దగ్ధమైంది. స్థానికులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఆనందబాయి శుక్రవారం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లింది.
ఈ క్రమంలో ఇంట్లో నుంచి పొగలు రావడంతో స్థానికులు గమనించి ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించగా.. సిబ్బంది చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఇంట్లోని వస్తువులతోపాటు రూ.30వేల నగదు, రెండు తులాల బంగారం కాలిపోయింది. రెవెన్యూ సిబ్బంది చేరుకొని పంచనామా నిర్వహించారు.