కూసుమంచి, వెలుగు : షార్ట్‌షర్క్యూట్‌తో ఇల్లు దగ్ధమైంది. పత్తి, మిర్చి, ధాన్యం, ఇతర వస్తువులు దగ్ధమయ్యాయి. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని చేగొమ్మలో మంగళవారం జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు బొల్లం సైదులు మంగళవారం ఉదయం తన భార్యతో కలిసి పొలం పనులకు వెళ్లాడు.
సాయంత్రం ఒక్కసారిగా ఆయన ఇంట్లో నుంచి మంటలు వచ్చాయి. స్థానికులు వెంటనే ఫైరింజన్‌కు, సైదులుకు సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. అప్పటికే ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఇంట్లో సుమారు రూ.6 లక్షల విలువైన 70 కింటాళ్ల పత్తి, 25 క్వింటాళ్ల మిర్చి, 60 బస్తాల ధాన్యం, ఇతర వస్తువులన్నీ బూడిదయ్యాయి. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రమేశ్ కుమార్ తెలిపారు.