బోధన్, వెలుగు : పట్టణంలోని ఆచన్‌పల్లిలో తాండ్రల అనితకు చెందిన రేకుల ఇల్లు షార్ట్ సర్క్యూట్ తో మంగవారం కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే ఇంట్లోని సామగ్రి, బియ్యం, బట్టలు, బీరువా, ఫ్రిజ్, రూ. 10 వేల నగదు పూర్తిగా కాలిపోయాయి. ఘటనపై ఆర్ఐ అరుణ్ పంచనామా నిర్వహించారు.
దాదాపు రూ. 2 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ భర్త శరత్‌రెడ్డి, నాయకులు ఇంద్రకరణ్, గ్రామస్తులు కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు.