
- ఇల్లు దగ్ధం రూ. 20 లక్షల ఆస్తి నష్టం
మెదక్, వెలుగు: కోతులు కరెంట్ వైర్లను ఊపడంతో షార్ట్ సర్క్యూట్ అయి ఇళ్లు దగ్దమైంది. ఈ ప్రమాదంలో రూ.20 లక్షల ఆస్తి నష్టం జరిగింది. బాధితుడు తెలిపిన ప్రకారం.. మెదక్ పట్టణం కుమ్మరి గడ్డలో ల్యాబ్ టెక్నిషియన్ కుమ్మరి సంతోష్ కు చెందిన ఇళ్లు సోమవారం షార్ట్ సర్య్కూట్తో దగ్ధమైంది. కోతులు కరెంట్ వైర్లను పట్టుకుని ఊపడంతో మంటలు చెలరేగి ఇళ్లు పూర్తిగా కాలిపోయింది. సంతోష్ మెడికల్ ల్యాబ్ ఏర్పాటు కోసం సమకూర్చుకున్న రూ.4 లక్షల నగదు, 15 తులాల బంగారు ఆభరణాలు, ఫ్యాషన్ ప్రో బైక్, ప్రిడ్జ్, టీవీ, తదితర సామాగ్రి అంతా కాలి బూడిదయ్యాయి.
సంతోష్, ఆయన భార్యకు సంబంధించి స్టడీ సర్టిఫికెట్‌లు అన్నీ కాలిపోయాయి. ఫైర్ సిబ్బంది ఫైరింజన్ వచ్చి మంటలు ఆర్పగా.. అప్పటికే ఇంట్లోని సామగ్రి అంతా కాలిపోయింది. రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంఘటనా స్థలాన్ని సందర్శించి పంచనామానిర్వహించారు.