షాక్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం.. నాలుగు తులాల బంగారం బూడిద పాలు

షాక్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం.. నాలుగు తులాల బంగారం బూడిద పాలు

పెద్దపల్లి జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. పాలకుర్తి మండలం కొత్తపల్లి గ్రామంలో షాక్ సర్క్యూట్ తో వేల్పు గొండ కొమురయ్య అనే ఇల్లు  పూర్తిగా దగ్దం అయ్యింది. ప్రమాద సమయంలో  ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

 అయితే   ఇంట్లో  ఉన్న నాలుగు తులాల బంగారం, రూ.2.50 లక్షల నగదు తో పాటు ఇంట్లోని వస్తువులు బియ్యం కాలిపోయినట్లు చెబుతున్నారు కుటుంబ సభ్యులు.  ఇల్లు కట్టుకునేందుకు రెండు లక్షల రూపాయలు జమ చేసుకుంటే కాలిబూడిదయ్యాయని చెబుతున్నారు.స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.  కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు. 

Also Raed : వేములవాడలో డ్రంకెన్​ డ్రైవ్‌‌‌‌లో 41 మందికి జైలు శిక్ష