నిర్మల్ జిల్లా బైంసాలో అర్థరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక వినాయక్ నగర్‌లో నివాసం ఉంటున్న బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బంధువు శివాజీ పటేల్ బంధువుల ఇంట్లో ఎఫ్ఎస్‌టీ టీమ్ సహయంతో పోలీసులు సోదాలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు వెంటనే అక్కడి భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఈ క్రమంలో అక్కడ పోలీసులకు, కార్యకర్తలకు ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు పోలీసులకు , కార్యకర్తలకు గాయాలు అయ్యాయి.
ఈ చర్యలకు పాల్పడిన వారిపై సీసీ కెమెరాలు పరిశీలించి, వివరాలు సేకరించి అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. అర్ధరాత్రి పోలీసులు కాంపౌండ్ వాల్ దూకి డోర్లను బాదడంతో భయబ్రాంతులకు గురయ్యామని కుటుంబ సభ్యులు తెలిపారు. వచ్చింది ఎవరో తమకు ఎలా తెలుస్తుందని అన్నారు. పోలీసులు సోదాలు చేస్తుంటే వారికి సహకరించామని, కంప్లైంట్ కాపీ అడిగితే పోలీసులు చూపించలేదని శివాజీ పటేల్ సోదరి, కుటుంబీకులు ఆరోపించారు.