కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఇంట్లో సోదాలు

కామారెడ్డి: మరో కొన్ని గంటల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. పోలింగ్ కు ముందు సైలెంట్ పీరియడ్ లో ఎన్నికల సంఘం యాక్టివ్ గా పనిచేస్తుంది. ఎన్నికల నియమావళి ఉల్లంఘించినట్లు ఫిర్యాదులు అందడమే ఆలస్యం తనిఖీలు చేపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల నగదు పట్టుబడగా.. మరికొన్ని రాజకీయ నేతల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తోంది ఎన్నికల సంఘం.ఇప్పటికే పలువురు నేతల ఇండ్లలో సోదాలు చేపట్టిన ఎలక్షన్ కమిషన్..

తాజాగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ నివాసంలో ఫ్లయింగ్ స్వ్కాడ్ సోదాలు నిర్వహిస్తోంది. నాన్ లోకల్స్ కొందరు షబ్బీర్ అలీ ఇంట్లో ఉన్నారని సమాచారంతో తనిఖీలు చేపట్టారు.  షబ్బీర్ అలీ ఇంట్లో కర్ణాటక ఎమ్మెల్యే ఉన్నాడని ఫోన్ కాల్ రావడంతో ఆయన ఇంట్లో సోదాలు చేశారు. దీంతో కాంగ్రెస్ నాయకులకు, ఫ్లయింగ్ స్వ్కాడ్ లకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.