ఇండియన్ ఆర్మీ రివేంజ్ స్టార్ట్.. IED బాంబులతో టెర్రరిస్ట్ ఇల్లు పేల్చివేత

ఇండియన్ ఆర్మీ రివేంజ్ స్టార్ట్.. IED బాంబులతో టెర్రరిస్ట్ ఇల్లు పేల్చివేత

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‎లోని పహల్గాంలో నరమేధం సృష్టించిన ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ సీరియస్‎గా సాగుతోంది. 28 మంది అమాయక ప్రజలను ఊచకోత కోసిన నరహంతకుల కోసం భారత భద్రతా దళాలు జమ్మూ కాశ్మీర్‎ను అణువణువునా జల్లెడ పడుతున్నారు. శుక్రవారం (ఏప్రిల్ 26) పుల్వామా జిల్లా త్రాల్‌లోని మోంఘమా ప్రాంతంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. 

ఈ క్రమంలో పహల్గాం ఉగ్రదాడిలో కీలక పాత్ర పోషించిన టెర్రరిస్ట్ ఆదిల్ షేక్ ఇంటిని గుర్తించిన భద్రతా దళాలు.. ఐఈడీ బాంబులతో అతడి ఇంటిని నేలమట్టం చేశాయి. ఆదిల్ షేక్‎తో పాటు మరికొందరు లోకల్ టెర్రరిస్టుల స్థావరాలను కూడా జవాన్లు ధ్వంసం చేశారు. భారీ పేలుడుతో ఉగ్రవాది ఆదిల్ షేక్ ఇంటిని భారత దళాలు పేల్చివేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. 

అమాయక ప్రజల హత్యతో శోకసంద్రంలో మునిగిపోయిన దేశ ప్రజలు.. ఈ వీడియో చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇండియా రివేంజ్ టైమ్ స్టార్ట్ అయ్యిందంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు ముమ్మురంగా సెర్చ్ ఆపరేషన్‎ను కంటిన్యూ చేస్తున్నాయి. కొన్ని చోట్ల భద్రతా దళాలపై ముష్కరులు కాల్పులకు తెగబడుతున్నారు. దీంతో ప్రకృతి అందాలకు నిలయమైన జమ్మూ కాశ్మీర్ తుపాకీ తూటాల చప్పుళ్లతో దద్దరిల్లితోంది. 

కాగా, జమ్ముకాశ్మీర్‎లోని పహల్గాం ఏరియా బైసారన్ మైదాన ప్రాంతంలో మంగళవారం (ఏప్రిల్ 22) ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. మినీ స్విట్జర్లాండ్‎గా పిలిచే  పహల్గాంకు కుటుంబంతో కలిసి సరదాగా టైమ్ స్పెండ్ చేసేందుకు వచ్చిన పర్యాటకులపై ఉగ్రమూకలు విచక్షణరహితంగా కాల్పులు జరిపాయి. ముష్కరుల పాశవిక దాడిలో 26 మంది అమాయక ప్రజలు మృతి చెందగా.. మరికొందరు పర్యాటకులు బుల్లెట్ గాయాలకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో యావత్ దేశమంతా ఉలిక్కిపడింది. ఈ ఘటనతో దాయాది పాక్, భారత్ మధ్య వివాదం మొదలైంది.