అద్దె కట్టకపోతే మహిళను కొడతారా..: హైదరాబాద్ లో ఇంటి ఓనర్ దారుణం

అద్దె కట్టకపోతే మహిళను కొడతారా..: హైదరాబాద్ లో ఇంటి ఓనర్ దారుణం

హైదరాబాద్ సిటీ నడిబొడ్డున అత్తాపూర్ లో దారుణం. ఇంటి అద్దె కట్టలేదని ఓ యువతిపై దాడి జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. 2024, నవంబర్ 10వ తేదీ ఆదివారం రాత్రి ఈ ఘటన కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

అత్తాపూర్ ఏరియా హసన్ నగర్ లో ఓ యువతి కుటుంబం అద్దెకు ఉంటుంది. కొంత కాలంగా ఆ యువతి ఇంటి అద్దె చెల్లించటం లేదు. ఈ క్రమంలోనే ఇంటి యజమానితో వివాదం నడుస్తుంది. అద్దె చెల్లించని కారణంగా.. ఇంటికి కరెంట్ కట్ చేశాడు యజమాని. దీంతో వివాదం పెద్దది అయ్యింది. మాటలు దాటి.. చేతల వరకు వచ్చింది. 

ఇంటికి కరెంట్ కట్ చేయటంపై అద్దెకు ఉన్న యువతి.. ఇంటి యజమానితో గొడవకు దిగింది. ఈ క్రమంలోనే ఇంటిని ఖాళీ చేయాలంటూ గొడవకు దిగాడు. ఇంటి ఓనర్.. యువతిపై దాడి చేశాడు. ఈ దాడిలో యువతి చేతికి, తలకు గాయాలు అయ్యాయి. ఆమెను ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అద్దె కట్టకుండా తననే వేధిస్తున్నారని.. ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇంటి యజమాని అంటున్నారు. ఇదంతా ఒకటి అయితే.. యువతిపై దాడి ఘటనతో.. ఆమెకు తీవ్ర గాయాలు కావటం.. దీనిపై కంప్లయింట్ రావటంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.