సివిల్స్‌ యాస్పిరెంట్ బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు.. చివరికి

సివిల్స్‌ యాస్పిరెంట్ బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు.. చివరికి

ఐఏఎస్ అవుదామని కోచింగ్ తీసుకోవడానికి వచ్చిన అమ్మాయి.. రూం రెంట్ కు తీసుకొని ప్రిపరేషన్ కొనసాగిస్తోంది. ఇంటి ఓనర్ కొడుకు అమ్మాయిపై కన్నేశాడు. అతను చేసిన పనికి పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు ఏం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ యువతి సివిల్స్ ప్రిపరేషన్ కోసం ఢిల్లీ వచ్చింది. ఢిల్లీలోని షకర్‌పూర్‌లో ఓ ఇంట్లో రూం అద్దెకు తీసుకొని చవువుకొంటుంది. ఇంటి ఓనర్ కొడుకు కరణ్(30) రహస్యంగా ఆ యువతి బెడ్ రూం, బాత్ రూంలో సీక్రెట్ గా స్పై  కెమెరాలు అమర్చాడు. యువతి వాట్సాప్ తరుచూ ఆమెకు తెలియకుండానే వేరే డివైస్ లో లాగిన్ అవుతుంది. దీంతో ఆమెకు అనుమానం వచ్చింది. ఎవరైనా ఆమెపై నిఘా పెట్టారా అని యువతి రూం మొత్తం వెతికింది. అపార్ట్‌మెంట్‌లో యువతి గాలించగా.. బాత్రూమ్, బెడ్‌రూమ్‌లోని బల్బ్ హోల్డర్‌లో రెండు స్పై కెమెరాలు కనిపించాయి. దీంతో ఈ విషయం వెలుగులోకి రాగానే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ALSO READ | కొత్త ఫోన్ కొని.. ఫ్రెండ్స్ చేతిలో చనిపోయాడు.. ఎందుకంటే..?

పోలీసులు విచారణలో కరణ్ నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు ఇంటి ఓనర్ కొడుకు కరణ్ రూంలో సోదాలు నిర్వహించారు. అతని దగ్గర ఓ స్పై కెమెరాతోపాటు రికార్డ్ అయిన వీడియోలు స్టోర్ చేసుకోవడానికి ఓ ల్యాప్ టాప్ ని పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. మూడు నెలల క్రితం యువతి సొంతూరుకి వెళ్లేటప్పుుడు గది తాళాలు కరణ్ కు ఇచ్చినట్లు ఆమె పోలీసులకు తెలిపింది. భారతీయ న్యాయ్ సంహిత చట్టం కింద పలు సెక్షన్‌ తో కరణ్ పై కేసు నమోదు చేశారు. కరణ్ కు ఓ సంవత్సరం జైలు శిక్ష విధిస్తారని సమాచారం.