
- పెబ్బేరు పట్టణంలోని రూ.3.49 లక్షలు బకాయి
పెబ్బేరు, వెలుగు: రెండేళ్లుగా ఆస్తి పన్ను చెల్లించని ఓ ఇంటిని పెబ్బేరు మున్సిపల్అధికారులు మంగళవారం సాయంత్రం సీజ్చేశారు. పెబ్బేరు పట్టణ శివారులోని పీజేపీ క్యాంపునకు ఎదురుగా పట్టణానికి చెందిన ఎం.రమేశ్ అనే వ్యక్తికి పలుమార్లు నోటీసులు ఇచ్చినా.. తన ఇంటికి సంబంధించి రెండేళ్లుగా ఆస్తి పన్ను చెల్లించడం లేదని మున్సిపల్అధికారులు తెలిపారు. దాదాపు రూ.3.49 లక్షల బకాయి ఉన్నారని, కట్టకపోవడంతో మంగళవారం సీజ్ చేసినట్లు మేనేజర్ గణేష్ బాబు తెలిపారు.