
వాషింగ్టన్: యూఎస్ హౌస్ స్పీకర్ గా రిపబ్లికన్ పార్టీకి చెందిన మైక్ జాన్సన్ మరోసారి ఎన్నికయ్యారు. మైక్ కు అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తి మద్దతిచ్చారు.శుక్రవారం యూఎస్ హౌస్ స్పీకర్ పదవికి ఎన్నికలు జరిగాయి. మైక్ జాన్సన్ కు అనుకూలంగా 218 ఓట్లు, వ్యతిరేకంగా 215 ఓట్లు వచ్చాయి. ఇద్దరు ప్రతిపక్ష సభ్యులు సైతం ఆయనకే మద్దతుగా ఓటు వేశారు. అయితే, తాను వారికి ఎలాంటి మందస్తు హామీలు ఇవ్వలేదని మైక్ తెలిపారు. అనంతరం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. న్యూ ఇయర్ డే టెర్రరిస్ట్ దాడికి గుర్తుగా ఒక క్షణం మౌనం పాటించాలని పిలుపునిచ్చారు.