ఇండ్లకు స్టిక్కరింగ్​కంప్లీట్..నవంబర్ 21 వరకు రెండోదశ సమగ్ర కుటుంబ సర్వే

ఇండ్లకు స్టిక్కరింగ్​కంప్లీట్..నవంబర్ 21 వరకు రెండోదశ సమగ్ర కుటుంబ సర్వే
  • వ్యక్తిగత, ఫ్యామిలీ వివరాలు సేకరిస్తున్న ఎన్యూరేటర్లు 
  • 21 వరకు డాటా సేకరణ ప్రక్రియ 

హైదరాబాద్: రెండోదశ సమగ్ర కుటుంబ సర్వే రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ ప్రారంభమైంది.  ఈ నెల 21 వరకు  ఎన్యూమరేటర్లు  ఈ సర్వేను  కొనసాగించనున్నారు.  మొదటిదశ సర్వేలో భాగంగా  తొలి మూడు రోజులు పాటు  స్టిక్కరింగ్​పూర్తి చేశారు. ఇవాళ్టి నుంచి  ప్రతి ఇంటికి వెళ్లి వ్యక్తిగత, ఫ్యామిలీ వివరాలను సేకరిస్తున్నారు.   పొద్దున్న 10 గంటల నుంచి ఈ ప్రక్రియను షురూ చేశారు. 

ఇందులో భాగంగా కుల వివరాలు సేకరిస్తున్నారు.  ఇప్పటికే  ప్రభుత్వం   మొత్తం 243 కులాలను ఫైనల్ చేసి క్యాస్ట్ కోడ్స్ లిస్ట్  రెడీ చేసింది.   ఇందులో ఎస్సీ కేటగిరీ లో 59 కులాలు, ఎస్టీ కేటగిరిలో 32, బీసీ కేటగిరి లో 134 కులాలు, 18 కులాలను ఓసీ కేటగిరిలో గుర్తించారు.

కులం వివరాలు చెప్పకుంటే 999 కోడ్​ను ఫారంలో నమోదు చేసేలా ఫార్మాట్​ను మార్చారు. సేకరించిన వివరాలను ఎప్పటికప్పుడు ఆన్​లైన్​ లో ఆప్లోడ్​ చేయను న్నారు.  87,092 మంది ఎన్యూమరేషన్​ బ్లాక్​లుగా కేటాయించి ఈ ప్రక్రియను చేస్తున్నారు.సర్వే కంప్లీట్​ చేయడానికి సెష్పల్​గా 94,750 మంది గణకులను, వారిపై 9,478 మంది సూపర్​వైజర్లను ప్రభుత్వం నియమించింది. 

కొన్నిచోట్ల మధ్యాహ్నం తర్వాత.. 

జీహెచ్ఎంసీ పరిధిలో 95 శాతం స్టిక్కరింగ్​ను  పూర్తి చేశారు.  గ్రేటర్​ వరంగల్​ పరిధిలో మరో 20 శాతం ఇండ్లకు స్టిక్కరింగ్​ వేయాల్సి ఉందని అధికారులు చెబుతు న్నా రు.  మొత్తం 66 డివిజన్​లో 1769 మంది ఎన్యుమరేటర్లు ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. కరీంనగర్, జగిత్యాల జిల్లాలలో కుటుంబ సమగ్ర సర్వే  ఇంకా ప్రారం భం కాలేదు.  స్టిక్కరింగ్ పూర్తికాని ఇండ్లను కంప్లీట్​చేసి ఇవాళ మధ్యాహ్నం తర్వాత సర్వే ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం.