
చాలామంది ఇంటిని నిర్మించేటప్పుడు లోన్ తీసుకుంటారు. తిరిగి లోన్ చెల్లించేందుకు కొంత ఆదాయాన్ని ఆ ఇంటిపై వచ్చేలా.. అంటే అద్దెకు ఇస్తుంటారు. ఇలా వచ్చిన ఆదాయంతో ఈఎమ్ఐ కట్టుకుంటుంటారు. ఇలా ఒక్కోసారి పై పోర్షన్ తరచూ ఖాళీ అవుతుంటే ఆ ఇంట్లో వాస్తు దోషం ఉందని గ్రహించాలి. ఈ సమస్యకు.. వాస్తు శాస్త్రంలో 60 ఏళ్ల అనుభవమున్న వాస్తు బ్రహ్మ, జ్యోతిష్య పండితులు కాశీనాథుని సుబ్రహ్మణ్యం సలహా సూచనలు పరిశీలిద్దాం. . .
ప్రశ్న: రెండేళ్ల క్రితం వేరేవాళ్లు కట్టించుకున్న ఇంటిని కొన్నప్పుడు .. . దాంట్లో కింద రెండు, పైన రెండు పోర్షన్లు ఉన్నాయి. మొదట్నించీ ఇంటి యజమాని కింద గదుల్లో ఉంటూ.. పైన ఉన్న పోర్షన్లను అద్దెకు ఇస్తే,, . ఒక పోర్షన్ తో ఎలాంటి సమస్యా లేదు. కాకపోతే రెండో పోర్షన్ లో ఎవ్వరూ మూడు నెలలకు మించి ఎక్కువ కాలం ఉండట్లేదు. ఒక్కొక్కరు ఒక్కో కారణం చెప్పి ఖాళీ చేస్తున్నారు. వాస్తు దోషం వల్లే ఇలా జరుగుతోందని తెలిసిన వాళ్లు అంటున్నారు. ప్రస్తుతం ఆ పోర్షన్ ఖాళీగానే ఉంది
జవాబు: ఏ ఇంటి వాస్తు దోషాలైనా... అందులో ఉండే వాళ్లపైనే ఉంటాయి. ఇంటి పై పోర్టన్ వాస్తు బాగోలేదంటున్నారు. కాబట్టి ఒకసారి వాస్తు నిపుణులకు చూపించండి. దానివల్లే అద్దెకు ఉండేవాళ్లు మారుతున్నట్లు తెలిస్తే... వెంటనే వాస్తును సరిచేయండి. మరో ముఖ్య విషయం అద్దెకు ఇవ్వడానికి కేటాయించిన ఇల్లైనా ....స్థలమైనా .. . అది ఖాళీగా ఉంటే, వాస్తు వల్ల కలిగే చెడు ప్రభావం ఇంటి యజమానిపైనే పడుతుంది.ఆ దుష్ప్రభావాలు కచ్చితంగా యజమానిపై పడతాయి.