Vastu Tips:  కింద సింగిల్​ బెడ్​ రూం.. పైన డబుల్​ బెడ్​ రూం ఉండచ్చా.. 

Vastu Tips:  కింద సింగిల్​ బెడ్​ రూం.. పైన డబుల్​ బెడ్​ రూం ఉండచ్చా.. 

వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు నిర్మాణం ఎలా ఉండాలి..  ఇంటి గదులు ఏ దిశలో ఉండాలి.. ఇలా ప్రతి విషయాలు వాస్తు గ్రంథాలలో ప్రస్తావించారు. కొంతమంది గ్రౌండ్​ ఫ్లోర్​ సింగిల్​ బెడ్​ రూం... పై ఫ్లోర్​ డబుల్​ బెడ్​ రూం కట్టుకోవాలనుకుంటారు.  అయితే ఇలా నిర్మించేటప్పుడు వాస్తు పండితుల సలహాలను తీసుకోవాలి.  గదుల పారు తప్పకుండా నిర్మించుకోవచ్చని వాస్తు పండితులు చెబుతున్నారు.   

కింద సింగిల్ బెడ్ రూం ఉన్నా పైన డబుల్ బెడ్రూం కట్టుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. కింద ఫ్లోర్ వాస్తు ప్రకారం ఉన్నప్పుడు... కింద హాల్, బెడ్ రూమ్ పెద్దగా ఉంటే  వాటి సైజు తగ్గించి, ఆ ప్లేసులో పైన రెండు బెడ్ రూమ్స్ వచ్చేలా ప్లాన్ చేసుకోవచ్చు. అయితే హాల్​ను విడగొట్టేటప్పుడు పారుతప్పకుండా జాగ్రత్తలు తీసుకోండి.  పైకి వెళ్లడానికి మెట్లు ఉత్తరం వైపు లేదా దక్షిణం వైపు పెట్టుకోవాలి. కిచెన్ ఆగ్నేయంలో ప్లాన్ చేసుకోండి. ఒకసారి మీకు దగ్గర్లో ఉన్న సిద్ధాంతికి చూపించి సలహా తీసుకోండి.

మాస్టర్ బెడ్రూమ్ ఇంటి నైరుతి మూలలో నిర్మించాలి.  మాస్టర్ బెడ్రూమ్ ఎప్పుడూ ఈశాన్యం వైపు ఉండకూడదని. ..కూడా వాస్తు పండితులు చెబుతున్నారు. వాస్తు ప్రకారం, ఆగ్నేయ దిశలో  మాస్టర్​ బెడ్ రూం ఉండకూడదు.  ఎందుకంటే ఇది అగ్నిచే పాలించబడుతుంది. ఇక్కడ బెడ్​ రూం ఉంటే అంటే దంపతుల మధ్య అపార్థాలు  కలహాలు ఉంటాయని వాస్తు సిద్దాంతులు చెబుతున్నారు. మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్​ పశ్చిమం, ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉండాలి. మాస్టర్ బెడ్రూమ్ యొక్క ప్రధాన ద్వారం ఎప్పుడూ దక్షిణ దిశలో ఉండకూడదు .

 వాస్తు నియమాల ప్రకారం బెడ్రూమ్ తలుపునకు ఎదురుగా బెడ్​ను ఉంచడం మానుకోండి.  వాస్తు ప్రకారం, నిద్రించే స్థానం ఉండాలి తూర్పు లేదా దక్షిణం వైపు తల ఉంచి, మీకు మంచి మరియు ప్రశాంతమైన నిద్రను కలిగి ఉండటానికి సహాయపడుతుంది. మంచం యొక్క దిశ ఎప్పుడూ ఉత్తరం వైపుగా ఉండకూడదు ఎందుకంటే ఇది మిమ్మల్ని భయాందోళనలకు గురి చేస్తుంది. మరియు ఒత్తిడికి గురి చేస్తుంది. పడకల స్థానంతో పాటు, పడకల ఆకారం కూడా క్రమబద్ధంగా ఉండాలి. క్రమరహిత బెడ్ ఆకారాలను కలిగి ఉండకుండా ఉండండి.

వంటగది.. పూజా మందిరం

కొంతమంది వంటగదిలోనే దేవుడి గది కూడా కలిసి ఉంటుంది. అలాంటప్పుడు ఎంతో పవిత్రంగా.. రోజూ పూజించే దేవుడి పటాలు.. విగ్రహాలు జిడ్డు పట్టే అవకాశం ఉంది. అవకాశం ఉంటే వేరు వేరు గదులను ఏర్పాటు చేసుకోండి.   వాస్తు ప్రకారం తూర్పువైపు ఆగ్నేయంలో కిచెన్ ఉండాలి. వంట వండేవాళ్లు ఈస్ట్ ఫేస్ పెట్టి వంట చేయాలి. వంటగదిని, దేవుడి గదిని వేరు చేసుకోవడానికి మధ్యలో సన్నటి గోడ కట్టుకోండి. లేదా కర్టెన్ కట్టినా సరిపోతుంది. అయితే ఎక్కడైనా వంటగది ఇంటిలో నాలుగోభాగం కంటే తక్కువగా ఉండాలి.

వాటర్​ ట్యాంక్​ నిర్మాణం..

 పూర్వం ఇంటి చుట్టూ  పెద్ద పెద్ద పెరడులు ఉండేవి.  ఇప్పుడు క్రమేణ వాటిని తగ్గిస్తూ ఆ ఖాళీ స్థలంలో కూడా  మరో ఇల్లు నిర్మిస్తే.. అన్నదమ్ములు పంచుకుంటున్నారు.  ఉత్తరం వైపున ఉన్న ఖాళీ స్థలంలో మరో ఇల్లు నిర్మిస్తే   ఒక ఇంటికి నైరుతి దిక్కు, మరో ఇంటికి ఆగ్నేయం అవుతుంది. ఒకరికి మంచిదే కానీ మరొకరికి మంచిది కాదు. అన్న దక్షిణంలో, తమ్ముడు ఉత్తరంలో ఉండాలి. రెండు ఇళ్ల మధ్యలో తూర్పు దిక్కున ఖాళీ ఉండేలా చూసుకోండి.  అలాగే అక్కడ నీళ్లను నిల్వ చేసుకొనేందుకు వాటర్​ ట్యాంక్​ నిర్మించుకుంటే .. నీళ్ల ట్యాంక్​ ఇంటి కంటే ఎత్తులో ఉండాలి.  రెండిళ్లకు పూర్తిగా ఈశాన్యంలో ఉండేలా చూసుకోండి.  అలా వీలులేకపోతే.. పెద్ద వారు ( అన్న) ప్రత్యేకంగా మరో వాటర్​ ట్యాంక్​ నిర్మించుకోవడం మంచిదని వాస్తు పండితులు చెబుతున్నారు.