- సెప్టెంబర్ 1న పనిలో చేరిన బిహార్ జంట
- ఓనర్లు ఎక్కడ ఏం పెడుతున్నారో గమనించి దొంగతనం
- బండ్లగూడ జాగీర్‌లోని విల్లాలో ఘటన
గండిపేట, వెలుగు: నమ్మకంగా ఉంటున్నట్లు నటించి డాక్టర్ల ఇంట్లోని పని మనుషుల జంట రూ.50లక్షల విలువైన వజ్రాభరణాలు కొట్టేసింది. ఓనర్ఒక్కడే ఉన్న టైం చూసి, అందినకాడికి దోచేసి పరారైంది. బండ్లగూడ జాగీర్కార్పొరేషన్ పరిధిలోని మ్యాపిల్టౌన్ విల్లా నంబర్ 20లో ఉంటున్న కొండల్‌రెడ్డి, వందన భార్యాభర్తలు. వీరిద్దరూ డాక్టర్లు. కొండల్‌రెడ్డి ఇద్దరు పిల్లలు కూడా ఎంబీబీఎస్చదివారు.
ప్రస్తుతం పీజీ పరీక్షలు రాస్తుండడంతో వందన కొడుకుల దగ్గరకు వెళ్లింది. వీరి ఇంట్లో పని చేసేందుకు బిహార్‌కు చెందిన నవీన్‌కుమార్ యాదవ్, భారతి దంపతులు ఏజెంట్ బిట్టు ద్వారా నవంబర్ 1న వచ్చారు. విల్లా ఆవరణలోని సర్వెంట్రూమ్లో ఉంటున్నారు. వృత్తి రీత్యా సోమవారం ఉదయం బయటికి వెళ్లిన కొండల్‌రెడ్డి సోమవారం రాత్రి 10 గంటలకు ఇంటికి వచ్చి పడుకున్నాడు.
మంగళవారం ఉదయం 8 గంటలకు కాఫీ కోసం పిలవగా నవీన్‌యాదవ్ రాలేదు. ఫోన్‌చేయగా స్విచ్ఛాఫ్వచ్చింది. అతడి రూమ్‌కు వెళ్లి భార్యాభర్తలు ఇద్దరూ కనిపించలేదు. తర్వాత ఇంట్లో బీరువా తెరిచి చూడగా అందులోని డైమండ్ రింగులు, డైమండ్ నెక్లెస్, డైమండ్బ్యాంగిల్స్తోపాటు విలువైన బంగారు, వెండి ఆభరణాలు కనిపించలేదు. సీసీ కెమెరాలు పరిశీలించగా సోమవారం రాత్రి 8 గంటలకు భార్యాభర్తలిద్దరూ రెండు బ్యాగులతో ఇంట్లో నుంచి వెళ్తున్నట్టు కనిపించింది. రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.