ఇటీవలి కాలంలో ప్రధాన నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగడంతో, భారతీయ కుటుంబాలు పెద్ద పెట్టెల నుంచి చిన్న ప్యాకెట్లు, సాచెట్‌లకు మారుతున్నాయి. కిచెన్ బడ్జెట్‌లు అమాంతంగా కూలబడ్డాయి. తాజాగా టమాటాలను కొనుగోలు చేయడానికి బదులుగా, ప్రజలు చిన్న చిన్న డబ్బాల్లో లభించే టమాట ప్యూరీని కొనుగోలు చేయడానికి మారుతున్నారు. అల్లం నుంచి అల్లం పేస్ట్, వదులుగా ఉండే జీలకర్ర పొడి ఉండే చిన్న 7-గ్రాముల సాచెట్‌లను కొనుగోలు చేస్తున్నారు.
గత వారం నుంచి తాను టమాటాల ధర పెరగడంతో వంటలలో ప్యూరీని ఉపయోగిస్తున్నానని, డబ్బు కోసం దక్షిణ కోల్‌కతాలో నివసిస్తున్న ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని సుకన్య సిన్హా చెప్పారు. టమాటా ప్యూరీ పౌచ్‌లు 200 గ్రాముల చిన్న ప్యాక్‌లలో లభిస్తాయని, దీని ధర కేవలం రూ. 25 మాత్రమే అని ఆమె తెలిపారు.
పెరుగుతున్న ధరలు
వర్షపాతం కారణంగా పెరుగుతున్న పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. టమాటా ధర కిలో రూ.100కి చేరుకుంది. నెల రోజుల క్రితం కూడా కిలో రూ.550 ఉన్న జీలకర్ర పొడి తాజాగా రూ.800కి చేరింది. అదేవిధంగా అల్లం ధర కూడా అనూహ్యంగా పెరిగింది.
ఈ సరుకులన్నీ కూడా ప్రధానమైన భారతీయ ఆహారంలో ముఖ్యమైన భాగాన్ని కలిగి ఉంటాయి, శాకాహార, మాంసాహార భారతీయ వంటకాలలో జీలకర్ర పొడిని సైతం విరివిగా వినియోగిస్తారన్న విషయం తెలిసిందే. ఇప్పుడు దాని ధర కూడా పెరగడంతో తక్కువ ఖర్చుతో కూడిన సాచెట్ ప్యాక్‌లను ఉపయోగిస్తున్నారు.
లూజ్ జీలకర్ర పొడి అమ్మకాలు బాగా పడిపోయాయని, చిన్న సాచెట్ ప్యాక్‌లకు డిమాండ్ పెరిగిందని వ్యాపారులు అంటున్నారు. చిన్న అల్లం-వెల్లుల్లి పేస్ట్ సాచెట్‌ల విషయంలో కూడా ఇదే పరిస్థితి. దీనికి అధిక ధరలే కారణం.
ALSO READ:గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్..ఉస్మానియా ఆసుపత్రికి గవర్నర్ తమిళిసై
ఎనిమిది దశాబ్దాలుగా సాస్‌లు, ఆహార ఉత్పత్తులను తయారు చేస్తున్న చైనీస్ సంస్థ డైరెక్టర్ జానిస్ లీ ఈ విషయంపై స్పందించారు. టమటా ప్యూరీకి డిమాండ్ ఇటీవలి రోజుల్లో విపరీతమైన డిమాండ్ వస్తోందన్నారు. 800-గ్రాముల టమాటా ప్యూరీ ప్యాక్ ధర రూ. 60. ఇది టమాటాలతో వండడం కంటే చాలా పొదుపుగా ఉంటుంది.
సుగంధ ద్రవ్యాలు, ప్యూరీల చిన్న ప్యాక్‌లు, సాచెట్‌లు దాదాపు ఎల్లప్పుడూ ఈ ఉత్పత్తుల మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే లభిస్తాయి. ఇది పెద్ద కంపెనీల వినూత్న మార్కెటింగ్ విధానం కావచ్చు. అలాగే ఒకసారి అలవాటుపడిన తర్వాత, కస్టమర్లు సాచెట్‌లను ఇష్టపడతారు" అని ఓ స్టేషనరీ దుకాణం యజమాని చెప్పారు.