- న్యాయం చేయాలని బాధితుల విజ్ఞప్తి
ఖైరతాబాద్, వెలుగు: ఎన్నో ఏండ్లుగా నివాసం ఉంటున్న తమ ఇండ్లను రోడ్డు విస్తరణ పేరుతో కూలగొట్టారని ముషీరాబాద్‌లోని స్వామి వివేకానంద నగర్ బస్తీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్ లో సోమవారం వారు మాట్లాడారు. తామంతా దళిత సామాజిక వర్గానికి చెందిన వారమని, 19 ఇండ్లను జనవరి నెలలో రహదారి విస్తరణ పేరుతో తొలగించారన్నారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.