ఇండ్ల స్థలాల సాధన కోసం జర్నలిస్టుల సంతకాల సేకరణ

సూర్యాపేట, వెలుగు : ఉద్యమ కాలంలో కేసీఆర్ హామీ ఇచ్చిన ప్రకారం రాష్ట్రంలో పని  చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్  సూర్యాపేట జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఐతబోయిన రాంబాబు గౌడ్, పాల్వాయి జానయ్య డిమాండ్ చేశారు. ఫెడరేషన్  రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్​లో ఇండ్ల స్థలాల సాధన కోసం జర్నలిస్టుల సంత కాల సేకరణ కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇండ్ల స్థలాల సాధన జర్నలిస్ట్ ల హక్కు అని, అందుకే ప్రభుత్వం వెంట నే స్పందించి జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు బుక్క రాంబాబు, నాయకులు లింగాల సాయి, గట్టు అశోక్, పాలవరపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.