హౌసింగ్ బోర్డ్ ప్లాట్స్ వేలం

  • ఈ నెల 24, 30 వ తేదీలు వచ్చే నెల 5న నిర్వహణ 

హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ సిటీలో ఉన్న ఓపెన్ ప్లాట్లను వేలం వేసేందుకు హౌసింగ్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది.  హైదరాబాద్​లో నగరంలోని కూకుట్ పల్లి, కేపీహెచ్ బీ, గచ్చిబౌలి, భరత్ నగర్, బాలాజీ నగర్, రావిర్యాలో ఇవి ఉన్నాయి. 6 చదరపు గజాల నుంచి 210 చదరపు గజాల వరకు మొత్తం 73 ప్లాట్లను అధికారులు ఈ నెల 24, 30 వచ్చే నెల 5న వేలం వేయనున్నట్లు నోటిఫికేషన్ లో అధికారులు పేర్కొన్నారు. 

గచ్చిబౌలిలో గజం లక్షన్నర, కూకుట్ పల్లి, కేపీహెచ్ బీలో రూ.1లక్షా 25వేలు, రూ.80వేలు, రూ.90వేలు, రావిర్యాలో రూ.75వేలుగా హౌసింగ్ బోర్డు నిర్ణయించింది. సిటీలో ఇవి కీలకమైన ప్రాంతాలు కావడంతో వేలంలో ప్లాట్ల ధరలు రెండు లక్షల వరకు వెళ్లే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వేలంలో పాల్గొనే వాళ్లు రూ.2లక్షలు, రూ.1లక్ష డీడీలను వేలం ప్రారంభం అయ్యే రోజు ఉదయం 11 గంటల వరకు హౌసింగ్ బోర్డు నార్త్, వెస్ట్, సౌత్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు అందచేయాలని నోటిఫికేషన్ లో అధికారులు పేర్కొన్నారు.