ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో మేస్త్రీలే కీలకం: హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో మేస్త్రీలే కీలకం: హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్

హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో మేస్ర్తీలదే కీలక పాత్ర అని హౌసింగ్  కార్పొరేషన్  ఎండీ వీపీ గౌతమ్  అన్నారు. ప్రభుత్వం అందజేసే రూ.5లక్షలతో క్వాలిటీతో ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.  హైదరాబాద్  మాదాపూర్ లోని  నేషనల్  అకాడమీ ఆఫ్ కన్ స్ర్టక్షన్ ( న్యాక్ ) లో 7 జిల్లాలకు చెందిన 82 మంది మేస్ర్తీలకు ప్రారంభించిన ట్రైనింగ్  శనివారం పూర్తయింది. వీరికి ఎండీ వీపీ గౌతమ్, న్యాక్  డైరెక్టర్  శాంతిశ్రీ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎండీ  గౌతమ్  మాట్లాడుతూ బేస్ మెంట్, గోడలు, స్లాబ్​లో చేపట్టాల్సిన అధునాతన పద్ధతులపై మేస్త్రీలకు శిక్షణ ఇచ్చామన్నారు.