ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై.. మేస్త్రీలకు శిక్షణ

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై.. మేస్త్రీలకు శిక్షణ

మహబూబ్​నగర్​ కలెక్టరేట్​, వెలుగు : మహబూబ్​నగర్ నేషనల్ అకాడమీ ఆఫ్​ కన్​స్ట్రక్షన్​ (ఎన్​ఏసీ ) సెంటర్​లో హౌసింగ్  కార్పొరేషన్ సహకారంతో మేస్త్రీలకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై ఆరు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. చీఫ్ గెస్ట్​గా హౌసింగ్ కార్పొరేషన్​ ప్రాజెక్టు డైరెక్టర్​ వైద్యం భాస్కర్​ హాజరై మాట్లాడారు. రూ.5 లక్షల బడ్జెట్​లో ఇంటి నిర్మాణం నాణ్యతగా ఎలా నిర్మించాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా  వివరించారు. 

ఎన్​ఏఏసీ ఆఫీసర్లు ఇండ్ల నిర్మాణం కొత్త పద్ధతుల గురించి శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తారని, శిక్షణ కార్యక్రమాలకు క్రమం తప్పకుండా హాజరు కావాలని కోరారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్స్   ఇస్తామని  చెప్పారు. కార్యక్రమంలో ఎన్​ఏఏసీ ఏడీ శివశంకర్​, హౌసింగ్​ డీఈ, ఏఈలు పాల్గొన్నారు.