ఇండియాలో ఇండ్లు తెగ కొంటున్నారంట.. ఎంత రేటు ఉన్న ఇండ్లకు గిరాకీ ఉందంటే..

ఇండియాలో ఇండ్లు తెగ కొంటున్నారంట.. ఎంత రేటు ఉన్న ఇండ్లకు గిరాకీ ఉందంటే..

న్యూఢిల్లీ: మన దేశంలోని టాప్​–8 నగరాల్లో గత ఏడాది ఇండ్ల అమ్మకాలు 9 శాతం పెరిగాయని రియల్​ఎస్టేట్​ కన్సల్టెన్సీ నైట్​ఫ్రాంక్​ ప్రకటించింది. వడ్డీ రేట్లు నిలకడగా ఉండటం, ఎకనమిక్ ​గ్రోత్ ​బాగుండటంతో ఇండ్ల అమ్మకాలు ఏళ్ల గరిష్టానికి చేరాయి. మొత్తం 3,50,613 యూనిట్లు అమ్ముడయ్యాయి. రూ.2–5 కోట్ల మధ్య ధర గల ఇండ్లకు భారీ గిరాకీ ఉందని తెలిపింది. అమ్మకాల్లో హైదరాబాద్​, పుణేలు ఆల్​టైం హైకి చేరుకున్నాయి. ముంబై 13 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది.

ఇదిలా ఉంటే, హైదరాబాద్​లో గత ఏడాది జులై–డిసెంబరులో ఆఫీస్​లావాదేవీలు ఏడాది ప్రాతిపదికన 17 శాతం పెరిగి 10.3 మిలియన్ల చదరపు అడుగులుగా నమోదయ్యాయని నైట్​ఫ్రాంక్​ తెలిపింది. 2024లో రెసిడెన్షియల్​ మార్కెట్ ఏడాది ప్రాతిపదికన​ 12 శాతం పెరిగిందని, 36,974 యూనిట్లు అమ్ముడయ్యాయని వెల్లడించింది.