అందుకే చదువుకోమన్నది : IPS చేస్తానంటే.. 2 లక్షలు కట్టిన బీహార్ కుర్రోడు.. చివరికి ఏం జరిగింది..?

అందుకే చదువుకోమన్నది : IPS చేస్తానంటే.. 2 లక్షలు కట్టిన బీహార్ కుర్రోడు.. చివరికి ఏం జరిగింది..?

ఐపీఎస్.. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఉద్యోగం.. ఈ ఉద్యోగం కోసం సంవత్సరాల తరబడి చదవాలి.. అలాంటిది.. ఓ రెండు లక్షల రూపాయలు ఇస్తే.. ఐపీఎస్ ఉద్యోగం ఇప్పిస్తాను అనగానే.. ఠక్కున 2 లక్షల రూపాయల కట్టిన బీహార్ కుర్రోడి కథ ఇది.. దేశంలో ఇంకా ఇలాంటోళ్లు ఉన్నారా అని నోరెళ్లబెట్టే విధంగా ఉన్న కథ వింటే.. మీరు కూడా షాక్ అవుతారు.. పూర్తి వివరాల్లోకి వెళితే..

బీహార్‌ లో  18 ఏళ్ల మిథిలేష్ కుమార్ ను  ఐపీఎస్ చేస్తానని మనోజ్ సింగ్ అనే వ్యక్తి  2 లక్షలు తీసుకుని బురిడీ కొట్టించాడు.  మరుసటి రోజు శారీరక కొలతలు తీసుకుని ఐపీఎస్ డ్రెస్, పిస్తోల్,బ్యాడ్జ్ ఇచ్చి  ఐపీఎస్ ఆఫీసర్ లా రెడీ చేశాడు . దీంతో ఐపీఎస్ అయ్యాననని  మిథిలేష్ ఉప్పొంగిపోయాడు.    యూనిఫాం, ఒక పిస్టల్ ధరించి  ఐపీఎస్ ఆఫీసర్ అవతారమెత్తి బైక్ పై తిరుగుతున్నాడు.  ఏదో పని కోసం సికంద్రా చౌక్  దగ్గర పడిపోయాడు అతడిని చూడటానికి చాలా మంది గుమిగూడారు. వెంటనే స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని మిథిలేష్ కుమార్ ను పట్టుకున్నారు. 

 రూ. 2 లక్షలు ఇస్తే  నాకు ఐపీఎస్ పోస్టు ఇప్పిస్తానని మనోజ్ సింగ్  చెప్పాడు. నెల రోజుల ముందే అతనికి అడ్వాన్స్ గా లక్షా 70 వేలు ఇచ్చాను.  ఖైరా స్కూల్ బయట బట్టలు, పిస్తోల్  ఇచ్చాడు.  మా అమ్మకు సమాచారం ఇచ్చా. దీంతో మిగిలిన రూ. 30 వేలు  మనోజ్ కు  చెల్లించడానికి మేము ఖైరాకు వెళ్లాము.  ఈ సమయంలో పోలీసులు మమ్మల్ని పట్టుకున్నారు. అని మిథిలేష్ పోలీసులకు చెప్పాడు.   అతడి నుంచి యూనిఫాంతో పాటు  పిస్టల్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తన  అధికారిక X  లో బాలుడి ఐపీఎస్ అవతారమెత్తిన వీడియోను పోస్ట్ చేసింది. సెప్టెంబర్ 20న పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటి వరకు 11లక్షల మందికి పైగా చూశారు. ఈ వీడియోపై నెటిజన్స్  ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్స్ చేస్తున్నారు. ముందుగా అతడిని మోసం చేసిన  వ్యక్తిని అరెస్ట్ చేయాలని కొందరు..ఆ యువకుడిని ఏం చేయొద్దని..కేసు పెట్టొద్దని మరికొందరు  కామెంట్స్ చేస్తున్నారు.