IPL 2024: ఐపీఎల్ టికెట్స్.. ఆన్‌లైన్‌లో ఎలా,ఎక్కడ బుక్ చేసుకోవాలి

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లోనే భారీ క్రేజ్ కలిగిన చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడడంతో ఈ మ్యాచ్ పై భారీ హైప్ నెలకొంది.  ఓ వైపు ధోనీ, మరోవైపు కోహ్లీని చూడడానికి ఫ్యాన్స్ చెపాక్ స్టేడియానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ మ్యాచ్ తో పాటు అన్ని జట్లకు ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లను ఎలా, ఎక్కడ బుక్ చేయాలో ఇప్పుడు చూద్దాం.

ఐపీఎల్ 2024 కోసం స్టేడియంలలో  టికెట్ ధర 399 రూపాయల కనీస ధర నుండి మొదలై 42,300 వరకు ఉంటుంది. లక్నో సూపర్ జెయింట్స్ కోసం చౌకైన టిక్కెట్ ధరలు 399 రూపాయల నుండి ప్రారంభమవుతాయి. చెన్నై సూర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగే హై వోల్టేజ్ ప్రారంభ మ్యాచ్ కోసం కనీస టిక్కెట్లు 1700 రూపాయలుగా నిర్ణయించబడ్డాయి. 

ఐపీఎల్ లో మొత్తం 10 జట్లున్నాయి. ఈ పది టీమ్స్  వివిధ టికెటింగ్ భాగస్వాములతో భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. వీటిలో ప్రధాన భాగస్వాములు BookMyShow, Paytm ఇన్‌సైడర్ కాగా.. RCB Ticketgenieతో టై-అప్ అయ్యి వారి అధికారిక వెబ్‌సైట్‌లో టిక్కెట్‌లను విక్రయిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ మినహా పది జట్లలో తొమ్మిది తమ ఇంటి టిక్కెట్లను ఇప్పటివరకు విడుదల చేశాయి. DC వైజాగ్‌లో తొలి దశలోని హోమ్ మ్యాచ్‌లను ఆడుతుంది. ఆఫ్‌లైన్‌లో టిక్కెట్‌లను ఎలా పొందాలనే దానిపై సమాచారం లేదు.

అన్ని టీమ్‌లు, వారి టికెటింగ్ భాగస్వాములు ఇవే

చెన్నై సూపర్ కింగ్స్ (Paytm ఇన్సైడర్), ముంబై ఇండియన్స్ (BookMyShow), గుజరాత్ టైటాన్స్ (Paytm ఇన్సైడర్), లక్నో సూపర్ జెయింట్స్ (BookMyShow), రాజస్థాన్ రాయల్స్ (BookMyShow), పంజాబ్ కింగ్స్ (Paytm Insider), సన్‌రైజర్స్ హైదరాబాద్ (Paytm ఇన్సైడర్), కోల్‌కతా నైట్ రిజర్స్ (BookMyShow), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (టిక్కెట్‌జెనీ) మరియు ఢిల్లీ క్యాపిటల్స్ (Paytm ఇన్‌సైడర్)

ALSO READ :- IPL 2024: మా బౌలర్లపై ఒక్క శాతం కూడా ఆ ప్రభావం ఉండదు: 20 కోట్ల వీరులపై ఆసీస్ దిగ్గజం