
స్మార్ట్‌ఫోన్ వాడుతున్న వారిని ఎక్కువగా వెంటాడే భయం హ్యాకింగ్. హ్యాకర్లు అధునాతనమైన సాఫ్ట్‌వేర్ వాడుతారు. యాపిల్‌కు సంబంధంలేని చానళ్లు, డివైజ్‌లు, అకౌంట్ల నుంచి హ్యాకింగ్‌కు పాల్పడుతారు. టెక్నాలజీకి తగ్గట్టు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటున్నరు. మూడో కంటికి తెలియకుండా.. ఫోన్ ఓనర్స్ కూడా పసిగట్టే అవకాశం ఇవ్వకుండా సిస్టమ్‌లోకి చొరబడి డేటా తీసుకుంటారు. అంతేకాదు ప్రమాదకరమైన లింకులను పంపించి.. యూజర్‌ను దానిపై క్లిక్ చేసేలా చేసి హ్యాకింగ్‌కు పాల్పడుతారు. నోటిఫికేషన్ మెసేజ్, ఈ మెయిల్, మెసేజ్, వాట్సాప్ చాట్‌లను లింకులు పంపించేందుకు వాడుకుంటారు. యూజర్ కన్విన్స్ అయ్యే సమాచారాన్నే లింకులుగా ఫార్వర్డ్ చేస్తారు. ఉదాహరణకు.. ఓ కుటుంబంలో ఒకరికి ఆరోగ్యం బాగాలేదని, డబ్బులు కొంచెం సర్దుబాటు చెయ్యండనో.. ఫేక్ అప్డేట్లను సెండ్ చేయడం ద్వారానో హ్యాకింగ్‌కు దిగుతారని యాపిల్ హెచ్చరించింది. స్మార్ట్‌ఫోన్‌ను ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి. దీని వల్ల మన ఫోన్‌పై జరిగే ఎటాక్‌లను 90శాతం నిరోధించవచ్చు.