హర్యానా ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. హర్యానా- పంజాబ్ రాష్ట్రాల మధ్య సరిహద్దు శంభూ బార్డర్ ను ఎందుకు మూసివేశారని ప్రశ్నించింది. వెంటనే హర్యానా- పంజాబ్ బార్డర్ శంభు వద్ద ఏర్పాటు చేసిన భారీ కేడ్లను తొలగించాని హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది.
2023ఫిబ్రవరి నుంచి సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు నల్ల చట్టాలను రద్దు చేయాలని పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన వేలాది మంది రైతులు ఆందోళన చేస్తున్నారు. తమ నిరసన గళం వినిపించేందుకు ఢిల్లీ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా శంభు సరిహద్దుల్లో రైతులను అడ్డుకునేందుకు హర్యానా ప్రభుత్వం హైవేపై బారీకేడ్లు ఏర్పాటు చేసి పూర్తిగా మూసివేసింది.
అయితే జూలై 10న హర్యానా- పంజాబ్ సరిహద్దు శంభూ హైవే ను వెంటనే తెరవాలని హర్యానా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులపై అప్పీల్ చేసే ప్రక్రియలో రాష్ట్రం ఉందని హర్యానా ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పడంతో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఈ వ్యాఖ్యలు చేసింది.
ఒక రాష్ట్రం హైవేను ఎలా అడ్డుకుంటుంది?.. అది ట్రాఫిక్ కు ఇబ్బంది కాదా.. వెంటనే తెరవండి అని హర్యానా ప్రభుత్వానికి జస్టిస్ భూయాన్ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలను ఎందుకు సవాల్ చేయాలనుకుంటున్నారు.. రైతులు కూడా దేశ పౌరులే కదా .. వారికి ఆహారం, వైద్యం అందించాలి అని జస్టిస్ సూర్యకాంత్ ప్రభుత్వం తరపు న్యాయవాదికి తెలిపారు.
ఫిబ్రవరి 21న పంజాబ్-హర్యానా సరిహద్దులోని ఖానౌరీ వద్ద జరిగి ఘర్షణల్లో బటిండాకు చెందిన రైతులు శుభకరన్ సింగ్ (21) మరణించారు. పలువురు పోలీస్ సిబ్బంది గాయపడ్డారు. రైతులు ఢిల్లీకి కవాతుగా వెళ్లేందుకు యత్నించగా భద్రతా సిబ్బంది వారిని అడ్డుకోవడంతో ఈ ఘర్షన తలెత్తింది. శంభు సరిహద్దు వద్ద ఉన్న బారీ కేడింగ్ ను వారం రోజుల్లో క్లియర్ చేరయాలని హర్యానా ప్రభుత్వం జూలై 10న హైకోర్టు ఆదేశించింది.