ఊరు దాటి వెళ్లలేదు.. అలాంటి చిన్నారులకు చైనా వైరస్ ఎలా ఎటాక్ అయ్యింది..!

ఊరు దాటి వెళ్లలేదు.. అలాంటి చిన్నారులకు చైనా వైరస్ ఎలా ఎటాక్ అయ్యింది..!

ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న  హ్యూమన్​మెటాప్ న్యుమో వైరస్(HMPV).. ఇప్పుడు ఇండియాకు వచ్చేసింది. కర్నాటక రాష్ట్రం బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్ ఎటాక్ కావటం కలకలం రేపుతోంది. చైనా వైరస్.. బెంగళూరులోని చిన్న పిల్లలకు ఎలా సోకింది అనేది చర్చనీయాంశం అయ్యింది.

హ్యూమన్​మెటాప్ న్యుమో వైరస్(HMPV) వైరస్ సోకిన 8 నెలల చిన్నారి కుటుంబానికి.. 3 నెలల చిన్నారి కుటుంబానికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదు. వారి కుటుంబాలు బెంగళూరు సిటీ దాటి వెళ్లలేదు. ఇటీవల కాలంలో వారు ఎలాంటి ప్రయాణాలు కూడా చేయలేదు.. అయినా వారికి హ్యూమన్​మెటాప్ న్యుమో వైరస్.. HMPV వైరస్ ఎలా వచ్చింది అనేది ఆసక్తిగా మారింది. 3 నెలల చిన్నారికి చికిత్స చేసి.. ఇంటికి పంపించిన తర్వాత HMPV వైరస్ అని పరీక్షల్లో నిర్థారణ కావటంతో కర్నాటక వైద్య శాఖ అప్రమత్తం అయ్యింది. మళ్లీ చిన్నారిని ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స చేస్తున్నారు. 

చైనా, జపాన్ దేశాల్లో ఇప్పటికే HMPV వైరస్ తీవ్రస్థాయిలో ఉంది. లక్షల మంది పిల్లలు, వృద్ధులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఇండియాలో HMPV వైరస్ సోకిన ఇద్దరు పిల్లలకు ఎటాక్ అయిన వైరస్.. చైనా వైరస్ తో పోల్చి చూడటానికి.. కనీసం చైనా మెడికల్ డేటా కూడా అందుబాటులో లేకపోవటంతో డాక్టర్లు ఇబ్బంది పడుతున్నారు. HMPV వైరస్ కొత్తది కాకపోయినా.. 20 ఏళ్లుగా మనుగడలో ఉన్నా.. ఇప్పుడు మరింత శక్తివంతంగా దాడి చేయటం అనేది ఆందోళన కలిగిస్తుంది. 

Also Read :- ఇండియాలో HMPV వైరస్ ఒకటి కాదు.. రెండు కేసులు

బెంగళూరు సిటీలో HMPV వైరస్ సోకిన ఇద్దరు చిన్నారుల తల్లిదండ్రులు, వారి బంధువులు, చుట్టాలకు ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేకపోవటంతో.. ఇండియాలో  ఈ వైరస్ వ్యాప్తి ఎలా జరిగింది అనే విషయంపై కేంద్రం ఆరా తీస్తోంది. వివరాలు సేకరిస్తుంది. ట్రాకింగ్ మొదలుపెట్టింది. HMPV వైరస్ సోకిన ఇద్దరు చిన్నారులకు ఎలాంటి ప్రాణాపాయం లేకపోవటం అనేది మంచి పరిణామం అయినా.. వైరస్ వ్యాప్తిని అరికట్టటం అనేది చాలా చాలా ముఖ్యమైన అంశంగా భావిస్తోంది కేంద్రం. 

>>> బెంగళూరు బాప్టిస్ట్ ఆస్పత్రిలో 3 నెలల ఆడ శిశువుకు HMPV వైరస్ సోకినట్లు నిర్థారణ అయ్యింది. చికిత్స తర్వాత చిన్నారిని డిశ్చార్జ్ చేశారు. 
>>> బెంగళూరు బాప్టిస్ట్ ఆస్పత్రిలో జనవరి 3వ తేదీన 8 నెలల మగ శిశువు ఆస్పత్రిలో జాయిన్ కాగా.. HMPV వైరస్ ఉన్నట్లు జనవరి 6వ తేదీన నిర్థారణ అయ్యింది. ప్రస్తుతం ఈ చిన్నారిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స చేస్తున్నారు డాక్టర్లు.