IPL 2025: అద్భుతం జరిగితేనే అవకాశం: ప్లే ఆఫ్స్ రేస్‌లోనే చెన్నై, రాజస్థాన్.. టాప్-4 లోకి రావాలంటే ఇలా జరగాలి!

IPL 2025: అద్భుతం జరిగితేనే అవకాశం: ప్లే ఆఫ్స్ రేస్‌లోనే చెన్నై, రాజస్థాన్.. టాప్-4 లోకి రావాలంటే ఇలా జరగాలి!

ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. 99 శాతం వీరు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించడం అసాధ్యం. అయితే ఏదో చిన్న మూల వీరి ఆశలు చిగురించే ఉన్నాయి. ఇప్పటివరకు ఈ టోర్నీలో చెన్నై, రాజస్థాన్ జట్లు రెండు కూడా ఆడిన 9 మ్యాచ్ ల్లో రెండే విజయాలు సాధించాయి. మిగిలిన 5 మ్యాచ్ లు గెలిచినా వీరి ఖాతాలో 14 పాయింట్లు ఉంటాయి. ఐపీఎల్ లో ఒక జట్టు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించాలంటే కనీసం 16 పాయింట్లు ఉండాలి. అంటే 14 మ్యాచ్ ల్లో 8 మ్యాచ్ లు గెలిస్తే దర్జాగా ప్లే ఆఫ్స్ కు వెళ్తాయి. 

చాలా కొన్ని సందర్భాల్లో 8 మ్యాచ్ లు గెలిచినా టోర్నీ నుంచి నిష్క్రమించే అవకాశాలు ఉన్నాయి. మరో సందర్భంలో 7 మ్యాచ్ లు గెలిచినా ఇతర మ్యాచ్ ల ఫలితాల ఆధారంగా ప్లే ఆఫ్స్ కు చేరొచ్చు. గత సీజన్ లో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడిన 14 మ్యాచ్ ల్లో 7 గెలిచి ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది. ఇతర మ్యాచ్ ల ఫలితాలు ఆర్సీబీ కలిసి రావడం విశేషం. ఈ సారి కూడా చెన్నై, రాజస్థాన్ జట్లు టాప్ 4 లో ఉండడానికి ఒక చిన్న అవకాశం ఉంది. అయితే ఇలా జరగాలంటే అద్భుతం జరగాలి. 

చెన్నై, రాజస్థాన్ తాము ఆడబోయే చివరి 5 మ్యాచ్ ల్లో భారీ తేడాతో గెలవాలి.  అదే సమయంలో ప్రస్తుతం పాయింట్స్ టేబుల్ లో టాప్-3లో ఉన్న గుజరాత్ టైటాన్స్(12), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(12), ఢిల్లీ క్యాపిటల్స్(12) జట్లు మిగిలిన మ్యాచ్ ల్లో విజయం సాధించాలి. మరోవైపు ముంబై ఇండియన్స్(10), లక్నో సూపర్ జయింట్స్ (10), పంజాబ్ కింగ్స్(10) 7 మ్యాచ్ ల కంటే ఎక్కువ గెలవకూడదు. ఇలా జరిగితే చెన్నై, రాజస్థాన్ జట్లు నాలుగో స్థానం కోసం  ప్లే ఆఫ్స్ రేస్ లో ఉండొచ్చు. చెన్నై, రాజస్థాన్ రెండు జట్లు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించడం కుదరదు. మే 12 న ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.