మెగ్నీషియం తగ్గితే.. శరీరానికి అవసరమైన పోషకాల్లో మెగ్నీషియం ఒకటి. తిన్న ఫుడ్ నుంచి ఎనర్జీ రావడానికి, నాడీ వ్యవస్థని కంట్రోల్ చేయడానికి మెగ్నీషియం కావాలి. కొత్త ప్రొటీన్ల తయారీకి కూడా ఇది చాలా అవసరం. డయాబెటిస్, క్రానిక్ డయేరియా, పోషకాల్ని గ్రహించలేకపోవడం వంటివి మెగ్నీషియం లోపానికి దారి తీస్తాయి. మెగ్నీషియం తగ్గితే ఈ లక్షణాలు కనిపిస్తాయి...
* మెగ్నీషియం తక్కువైతే ఎముకలు బలహీనం అయి, ఆస్టియోపొరోసిస్ బారిన పడతారు.
* మానసికంగా హుషారు లేకపోవడం, ఎమోషన్స్ లేకపోవడం వంటివి మెగ్నీషియం లోపానికి సంకేతాలు.
* కండరాలు పట్టేస్తాయి. సడెన్గా బాడీ షేక్ అవుతుంది. అంతేకాదు హార్ట్ బీట్ లో తేడా వస్తుంది.
* మెగ్నీషియం చాలినంత లేకుంటే బీపీ పెరుగుతుంది. దాంతో గుండె సమస్యలు, బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్స్ ఉంది.
* రోజూ బాదం, నట్స్, పాలకూర, ఆలుగడ్డ తింటే మెగ్నీషియం లోపం రాకుండా చూసుకోవచ్చు.
Also Raed :- హిందీ పుష్పరాజ్కు డబ్బింగ్ చెప్పిన నటుడికి హార్ట్ ఎటాక్