ఎన్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఐలు డబుల్ ట్యాక్స్ తప్పించుకోండిలా

  • ఐటీఆర్‌‌‌‌‌‌‌‌తో పాటు 10 ఎఫ్‌‌‌‌, టీఆర్‌‌‌‌‌‌‌‌సీ తప్పనిసరి
  • 1‌‌‌‌‌‌‌‌0 ఎఫ్‌‌‌‌ను ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో పొందొచ్చు
  • ఉంటున్న దేశంలోని అధికారుల నుంచి  టీఆర్‌‌‌‌‌‌‌‌సీ కోరొచ్చు

న్యూఢిల్లీ:  డబుల్ ట్యాక్స్ పడకూడదనుకుంటే ఇన్‌‌‌‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్‌‌‌‌ (ఐటీఆర్‌‌‌‌‌‌‌‌) ఫైల్ చేసేటప్పుడు కొన్ని స్టెప్స్‌‌‌‌ను నాన్ రెసిడెంట్‌‌‌‌ ఇండియన్స్ (ఎన్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఐ) ఫాలో కావాలి.  లేకపోతే  క్లెయిమ్స్‌‌‌‌ను ట్యాక్స్ డిపార్ట్‌‌‌‌మెంట్ రిజెక్ట్ చేయొచ్చు. ఇండియాతో పాటు వారు ఉంటున్న దేశంలోనూ ట్యాక్స్ కట్టాల్సి రావొచ్చు. ఎన్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఐలపై  డబుల్ ట్యాక్స్ పడకుండా ఉండేందుకు ఇండియా 90 కిపైగా దేశాలతో  డబుల్ ట్యాక్స్  అవైడెన్స్‌‌‌‌ అగ్రిమెంట్ (డీటీఏఏఎస్‌‌‌‌) ను కుదుర్చుకుంది. ఇందులో యూఎస్‌‌‌‌ఏ, యూకే, కొరియా, తైవాన్ వంటి దేశాలు కూడా ఉన్నాయి.

 ఒకే ఆదాయంపై ఇండియాలోనూ, ప్రస్తుతం నివశిస్తున్న దేశంలోనూ ట్యాక్స్ పడకుండా ఉండేందుకు  డీటీఏఏ సాయపడుతుంది. ‘ ఉదాహరణకు యూఎస్‌‌‌‌లో ఎన్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఐ పనిచేస్తున్నాడని అనుకుందాం. కానీ, ఇండియాలోని ప్రాపర్టీపై రెంటల్‌‌‌‌ ఇన్‌‌‌‌కమ్‌‌‌‌ పొందుతున్నాడు. డీటీఏఏ లేకపోతే ఈ రెంటల్ ఇన్‌‌‌‌కమ్‌‌‌‌పై ఇండియాలోనూ, యూఎస్‌‌‌‌లోనూ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. డీటీఏఏ ఫైల్ చేస్తే ఏదో ఒక దేశంలో ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ యూఎస్‌‌‌‌లోనూ ట్యాక్స్ కడితే ఇండియాలో ట్యాక్స్ రిఫండ్‌‌‌‌ కోసం క్లెయిమ్‌‌‌‌ చేసుకోవచ్చు’ అని కరంజవాలా అండ్ కో అడ్వకేట్‌‌‌‌  విశాల్‌‌‌‌ గెహ్రానా అన్నారు.   

ఈ డాక్యుమెంట్స్ ముఖ్యం

డీటీఏఏ బెనిఫిట్స్‌‌‌‌ను  క్లెయిమ్‌‌‌‌ చేసుకోవడానికి ఎన్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఐలు ఫామ్‌‌‌‌ 10 ఎఫ్‌‌‌‌, ట్యాక్స్ రెసిడెన్సీ సర్టిఫికెట్‌‌‌‌ (టీఆర్‌‌‌‌‌‌‌‌సీ) ని ఐటీఆర్‌‌‌‌‌‌‌‌తో పాటు ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఫామ్‌‌‌‌ 10 ఎఫ్‌‌‌‌ ఒక సెల్ఫ్‌‌‌‌ డిక్లరేషన్ ఫామ్‌‌‌‌. ఇందులో రెసిడెన్సీ స్టేటస్‌‌‌‌, ఇరు దేశాల మధ్య డీటీఏఏ ట్రీటీ ఉందని తెలియజేసే వివరాలు, ఆదాయంకు సంబంధించి కొన్ని స్పెసిఫిక్ డిటైల్స్‌‌‌‌ ఉంటాయి. డీటీఏఏ బెనిఫిట్స్‌‌‌‌ను క్లెయిమ్ చేసుకోవడంలో ఫామ్‌‌‌‌ 10ఎఫ్ సాయపడుతుంది.  

టీఆర్‌‌‌‌‌‌‌‌సీని ఎన్‌‌‌‌ఆర్ఐ ఉంటున్న దేశం ఇష్యూ చేస్తుంది. ఇండివిడ్యువల్‌‌‌‌ తాను నివసిస్తున్న దేశంలో ట్యాక్స్ కడుతున్నాడని, డీటీఏఏ బెనిఫిట్స్‌‌‌‌కు అర్హత ఉందని టీఆర్‌‌‌‌‌‌‌‌సీ తెలియజేస్తుంది.  ఐటీఆర్ ఫైలింగ్ డెడ్‌‌‌‌లైన్‌‌‌‌ లోపు ఫామ్‌‌‌‌ 10ఎఫ్‌‌‌‌, టీఆర్‌‌‌‌‌‌‌‌సీ సబ్మిట్ చేయాలని, సాధారణంగా డెడ్‌‌‌‌లైన్‌‌‌‌ ప్రతీ ఏడాది జులై 31 న ఉంటుందని గెహ్రానా అన్నారు. ఈ డాక్యుమెంట్లను ఫైల్ చేయకపోతే  ఎన్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఐలు డీటీఏఏ బెనిఫిట్ కోల్పోతారని, సంబంధిత ఆర్థిక సంవత్సరంలో డబుల్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 

10 ఎఫ్​, టీఆర్‌‌‌‌‌‌‌‌సీ పొందొచ్చు ఇలా..

1. టీఆర్‌‌‌‌‌‌‌‌సీని తాను నివశిస్తున్న దేశంలోని ట్యాక్స్ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ నుంచి ఎన్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఐ పొందొచ్చు. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో కూడా ఈ ఫామ్‌‌‌‌ను కోరొచ్చు.
2. 10 ఎఫ్‌‌‌‌ ఫామ్‌‌‌‌ను  ఇన్‌‌‌‌కమ్‌‌‌‌ ట్యాక్స్ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆఫ్ ఇండియా లేదా ఈ–ఫైలింగ్ పోర్టల్ నుంచి డౌన్‌‌‌‌లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ ఫామ్‌‌‌‌ను ఫిల్ చేయాలి. 
3. ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు 10 ఎఫ్‌‌‌‌, టీఆర్‌‌‌‌‌‌‌‌సీ ఫామ్‌‌‌‌లను ఫైల్ చేయాలి. అప్పటికి టీఆర్‌‌‌‌‌‌‌‌సీ అందుబాటులో లేకపోతే తర్వాత ఫైల్ చేస్తానని చెప్పి, తాత్కాలిక క్లెయిమ్‌‌‌‌ చేయొచ్చు. ఎన్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఐలు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో ఈ డాక్యుమెంట్లను ఫైల్ చేయొచ్చు.

సెలబ్రెటీలలో షారుక్ ఖాన్ టాప్‌‌‌‌..

బాలీవుడ్  సూపర్‌‌‌‌‌‌‌‌స్టార్ షారూక్ ఖాన్‌ మిగిలిన సెలబ్రెటీల కంటే ఎక్కువ ట్యాక్స్ కడుతున్నారు. 2023–24  ఆర్థిక సంవత్సరానికి గాను ఆయన రూ.92 కోట్ల అడ్వాన్స్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌ను కట్టారు.  ఆ తర్వాత తమిళ హీరో తళపతి విజయ్‌‌‌‌ ఉన్నారు. ఆయన రూ.80 కోట్ల ట్యాక్స్ కట్టారు.  సెలబ్రెటీలు కట్టిన అడ్వాన్స్ ట్యాక్స్‌‌‌‌ను బట్టి ‘ది స్టార్ క్యాస్ట్‌‌‌‌’ లిస్ట్‌‌‌‌ను    ఫార్చూన్ ఇండియా మ్యాగజైన్ విడుదల చేసింది. ఈ లిస్ట్ ప్రకారం, సల్మాన్ ఖాన్ రూ.75 కోట్ల ట్యాక్స్‌‌‌‌ కట్టారు.

మూడో ప్లేస్‌‌‌‌లో ఉన్నారు. అమితాబ్‌‌‌‌ బచ్చన్‌‌‌‌ రూ.71 కోట్ల ట్యాక్స్ కట్టగా,  స్పోర్ట్స్‌‌‌‌ పర్సనాలిటీల్లో   విరాట్ కోహ్లీ రూ.66 కోట్ల ట్యాక్స్ కట్టి టాప్‌‌‌‌లో నిలిచారు. ఆయన తర్వాత ఎంఎస్‌‌‌‌ ధోని (రూ.38 కోట్లు), సచిన్ టెండుల్కర్‌‌‌‌‌‌‌‌ (రూ.28 కోట్లు), సౌరబ్ గంగూలి (రూ.23 కోట్లు) ఉన్నారు.  అజయ్ దేవగణ్‌‌‌‌ రూ.42 కోట్లు, రణ్‌‌‌‌బీర్ కపూర్‌‌‌‌‌‌‌‌ రూ.36 కోట్లు, హృతిక్‌‌‌‌ రోషన్ రూ.28 కోట్లు, అల్లూ అర్జున్‌‌‌‌ రూ.14 కోట్ల ట్యాక్స్ చెల్లించారు.