వేసవి కాలంలో వచ్చిందంటే సమృద్ధిగా దొరికేవి పుచ్చకాయలు.ఎండ వేడిమి సీజన్ లో చల్లదనాన్ని ఇస్తాయి. రీఫ్రెషింగ్, రుచికోసం తింటుంటాం. పుచ్చకాయలో విట మిన్ సీ, ఏ పుష్కలంగా ఉంటాయి.కొన్ని రకాల పుచ్చకాయలు క్యాన్సర్, గుండె సంబంధిత జబ్బులనుంచి రక్షించే శక్తివంతమైన ఆంటీక్సీడెంట్లను కలిగి ఉంటా యి. నీటి శాతం ఎక్కువగా ఉండే ఈ పుచ్చకాయలను తింటే ఎండ వేడిమికి డీహైడ్రేషన్ కాకుండా కాపాడుతుంది. పుచ్చకాయలను జూస్ గా కానీ, ఫ్రూట్ సలాడ్ ల రూపంలో గాని తీసుకుంటాం. అయితే పుచ్చకాయను కొనేటప్పుడు అది తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలో చూద్దాం.
Also Read:గ్రేట్ కదా.. ఆసుపత్రి నుంచి స్ట్రెచర్‌పై వచ్చి ఓటేసింది
- భూమిని తాకి ఉన్న పుచ్చకాయ కింది భాగాన్ని గమనించినట్లయితే.. గుండ్రగా పెద్దదిగా,చదునుగా పసుపురంగులో ఉండే పుచ్చకాయ బాగా పక్వానికి వచ్చి తీయగా ఉంటుంది. ఇది లావుగా పొడవుగా ఉంటే ఆకారాలకంటే తియ్యగా ఉంటుంది.
- గుండ్రగా, లావు ఆకారంలో ఉండే పుచ్చకాయలు సాధారణంగా పొడవైన, సన్నగా ఉంటే ఆకారాలకంటే తియ్యగా ఉంటాయి.
- గింజలు లేని పుచ్చకాయలు గింజలున్న పుచ్చకాయలు తియ్యగా ఉంటాయి. వీటిని విత్తనాలను పెంచడానికి, చక్కెరను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించ బడ తాయి.
- పుచ్చకాయ తోకను పరిశీలించినట్లయితే అది ఎండి ఉంటే పుచ్చకాయ బాగా పండినట్లు.. ఇది తియ్యగా ఉంటుంది.
- పుచ్చకాయపై ఉండే మచ్చలను బట్టి కూడా అది పండిందో లేదో తెలుసుకోవచ్చు. మచ్చలు పసుపు రంగులో ఉంటే బాగా పండిందని అర్థం.. ఇది తియ్యగా ఉంటుంది.
- బరువు పరంగా చూస్తే ఎక్కువ బరువున్న పుచ్చకాయలు తియ్యగా ఉంటాయి.