పదేళ్ల పాటు తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలను అప్పగించడానికి అప్పటి సీఎం కేసీఆర్ ఏడేళ్లు ఎలా అంగీకరించారని ప్రశ్నించారు. స్వతంత్ర్య భారతంలో ఏ రాష్ట్రంలో జరగని అవినీతి ఇక్కడ జరిగిందన్నారు. దీంతో తెలంగాణ ఏర్పాటుకు అర్థం లేకుండా పోయిందన్నారు. దీనిని ఇరిగేషన్ ప్రాజెకక్టుల్లో అద్భుతాలు జరిగాయంటూ బీఆర్ఎస్ ప్రచారం చేసుకుందని విమర్శించారు.
అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖపై చర్చ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. జగన్, కేసీఆర్ అలయ్ బలయ్ చేసుకున్నారని, బిర్యానీలు తిని గంటల తరబడి మాట్లాడుకున్నారని చెప్పారు మంత్రి ఉత్తమ్.. అయినా తెలంగాణకు నదీజలాల వాటాలో అన్యాయం జరిగిందన్నారు. కేసీఆర్ చాలా గొప్పవారని.. తెలంగాణ నీటిని కూడా ఏపీకి ఇస్తారని సీఎం జగన్ అసెంబ్లీలో చెప్పారన్నారు ఉత్తమ్.
also read : కేసీఆర్ , జగన్ దోస్తీ.. పోతిరెడ్డిపాడు నుంచి జల దోపిడీ : మంత్రి ఉత్తమ్
మరోవైపు KRMB కి ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టులు అప్పగించమని స్పష్టం చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నీటివాటాలు కాపాడటంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కృష్ణా నీళ్లు తెలంగాణకు ప్రధాన జీవనాధారం అని చెప్పారు.