
సునీతా విలియమ్స్.. పరిచయం అక్కరలేని పేరు. 278 రోజులు స్పేస్ సెంటర్ లో గడిపి వచ్చిన ఇండియన్ ఆరిజిన్ ఆస్ట్రోనాట్. అంతరిక్షం నుంచి వచ్చిన తర్వాత ఆమె పూర్తిగా కోలుకున్నారు. ఈ సందర్భంగా మంగళవారం (ఏప్రిల్ 1) మొదటిసారి స్పేస్ జర్నీకి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు మీడియాతో పంచుకున్నారు. ముఖ్యంగా ఇండియా గురించి ఆమె చెప్పిన ముచ్చట్లు వైరల్ గా మారాయి.
స్పేస్ నుంచి ఇండియా ఎలా ఉంటుంది..? అని అడిగిన ప్రశ్నకు అందమైన వివరణ ఇచ్చారు. స్పేస్ నుంచి చూస్తుంటే ‘‘ఇండియా చాలా అమేజింగ్ గా ఉంటుంది’’ అని అన్నారు. హిమాలయాలను దాటుకుంటూ అంతరిక్షం పోతుంటే ఆ అనుభూతి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పారు. ‘‘బుచ్ విల్మోర్, నేను, మా టీం హిమాలయాల నుంచి వెళ్లే ప్రతిసారి అద్భుతమైన ఫోటోలను తీసి కలెక్ట్ చేసుకుంటాము. హిమాలయాలు చూడటానికి ఇండియాలోకి అలలు వస్తున్నట్లుగా కనిపిస్తాయి’’ అని అన్నారు.
కక్ష నుంచి చూస్తుంటే ఇండియా ల్యాండ్ స్కేప్స్ కలర్ ఫుల్ గా కనిపిస్తాయని, ముఖ్యంగా ముంబై, గుజరాత్ ప్రాంతాలు వైవిధ్యంగా కనిపిస్తాయని అన్నారు. ఒక్కోసారి పెద్దపెద్ద వెలుగు వచ్చినట్లుగా లైట్ వస్తుందని, పెద్ద నగరాలు చిన్న టౌన్స్ గా మారుతున్నట్లుగా అనిపిస్తుందని, చూస్తుంటే చాలా అందంగా కనిపిస్తుందని ఈ సందర్భంగా సునీత విలియమ్స్ చెప్పారు.
ఇండియాతో తమకు ఉన్న అనుబంధాన్ని గురించి చెప్తూ చాలా ఎక్జైట్ మెంట్ గా ఫీలయ్యారు సునీత. అదేవిధంగా అంతరిక్ష ప్రయోగాలలో భారత్ వేస్తున్న అడుగులు అభినందనీయంగా ఉన్నాయని అన్నారు. త్వరలోనే ఇండియా స్పేస్ లో అడుగు పెడుతుందని అన్నారు. ‘‘ గ్రేట్ కంట్రీ.. అద్భుతమైన ప్రజాస్వామ్య దేశం. త్వరలో ఇండియా వెళ్తున్నాను. మా నాన్న పుట్టిన దేశం వెళ్తున్నానంటే ఆనందం మాటల్లో చెప్పలేను’’ అని ఇండియా గురించి షేర్ చేసుకున్నారు.