Allu Arjun-Shilpa Ravi: అల్లు అర్జున్ -వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి..స్నేహం ఎలా మొదలైంది?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మే 11, 2024న నంద్యాల నియోజకవర్గంలో తన మిత్రుడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిని గెలిపించాలని కోరుతూ నంద్యాలకు వచ్చి తన మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఫ్రెండ్ శిల్పా రవి ఇంటికి చేరుకున్నారు.తమ అభిమాన హీరో వచ్చిన విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ శిల్పా రవి ఇంటికి వేల సంఖ్యలో వచ్చారు.

అయితే, బెస్ట్ ఫ్రెండ్ కావడంతోనే పార్టీలకు అతీతంగా తాను రవిచంద్రరెడ్డికి మద్దతు తెలిపానని కూడా బన్నీ తెలిపారు.కానీ,ఇది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అభిమానులకి చాలా వరకు బన్నీ ఇలా చేయడం రుచించట్లేదు. సొంత మామ ఓ పక్కన విజయం కోసం పోరాడుతుంటే, ఇలా ఆపొసిషన్ అభ్యర్ధికి మద్దతు తెలపడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.మరి అల్లు అర్జున్ మద్దతు తెలిపిన శిల్ప రవికి తనకి ఉన్న బాండింగ్ ఎలాంటిదో తెలుసుకుందాం. 

వాస్తవానికి..శిల్పా రవి భార్య శిల్పా నాగిని రెడ్డి,అల్లు అర్జున్‌ సతీమణి స్నేహా రెడ్డి చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్స్. అంతేకాదు..వారిద్దరూ క్లాస్ మేట్స్‌ కూడా. దీంతో వారిద్దరి ద్వారా ఉన్న బాండింగ్, తరుచూ వీరు కలవడం..ఇక వీరితోపాటు బన్నీ, రవి కూడా కలుసుకునే వారు. అలా భార్యల మధ్యన ఉన్న స్నేహ బంధం..ఇక రవి, అల్లు అర్జున్‌ మంచి స్నేహితులు అవ్వడానికి కారణం అయింది.అలా వీరిద్దరి మధ్య ఎమోషనల్ బాండింగ్ పెరుగుతూ వస్తోంది. ఇక కలవడమే కాకుండా వీలు దొరికినప్పుడల్లా వీరి ఫ్యామిలీస్ అంతా కలిపి ఫారిన్ ట్రిప్స్ కూడా వెళ్తుండేవారు.ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో రవి కూడా తెలిపారు.

అలాగే రీసెంట్గా రవి చంద్రని మంచి మెజార్టీతో గెలిపించాలని అభిమానులని కోరుతూ బన్నీ ట్వీట్ కూడా చేశాడు. మరి బన్నీ ఇచ్చిన మద్దతుతో ఎలాంటి విజయం సాధిస్తాడో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక అల్లు అర్జున్ నంద్యాల వచ్చి సందడి చేసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇక బన్నీ ట్వీట్ చేయడంపై కూడా స్పందించారు శిల్పా రవి." నా స్నేహితుడి అల్లుఅర్జున్ కి హృదయపూర్వక ధన్యవాదాలు..నా ఎన్నికల్లో నాకు మంచి జరగాలని నంద్యాల వరకు ప్రయాణించినందుకు. అలాగే మీ అచంచలమైన మద్దతు ఎంతో గొప్పతనం ఉంది. మన స్నేహానికి నేను చాలా కృతజ్ఞుడను! #తగ్గేదెలె"అంటూ తన కృతజ్ఞతను ట్వీట్ లో వెల్లడించాడు.