సెనేట్​లో ఇంపీచ్​మెంట్​ ఎలా సాగుతుందంటే…

అమెరికాలో మన దేశంలో మాదిరే రెండు చట్టసభలున్నాయి. వాటిలో ఒకటి రిప్రజెంటేటివ్స్​ సభ, రెండోది సెనేట్​. ప్రతినిధుల సభలో నెగ్గిన బిల్లును సెనేట్​కూడా ఆమోదించాలి. ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్​పై వచ్చిన ఇంపీచ్​మెంట్​ మోషన్ ప్రతినిధుల సభలో నెగ్గింది. అధికారంలో ఉన్న ట్రంప్​ పార్టీ రిపబ్లికన్లకు దిగువ సభలో మెజారిటీ లేదు. మొత్తం 441 మంది సభ్యులలో 435 మందికి మాత్రమే ఓటింగ్​ హక్కు ఉంటుంది. మిగతా ఆరుగురికి ఓటింగ్​ ఉండదు. అంటే, ఏదైనా బిల్లు నెగ్గాలంటే 218 ఓట్లు రావాలి. రిప్రజెంటేటివ్స్​ హౌస్​లో ప్రతిపక్ష డెమొక్రాట్లు 233 మంది ఉండగా, అధికార రిపబ్లికన్లు 197 మందే ఉన్నారు. దాంతో తేలిగ్గానే ట్రంప్​పై తెచ్చిన ఇంపీచ్​మెంట్ ​మోషన్​ నెగ్గింది. ఇక, సెనేట్​లో దానిని ఆమోదించాల్సి ఉంటుంది. 100 మంది సభ్యుల సెనేట్​లో అధికార పార్టీకి 53 ఓట్లున్నాయి. ప్రతిపక్ష డెమొక్రాట్లు 45 మంది ఉన్నారు.

ఈ నేపథ్యంలో అసలు ఈ సెనేట్​ విషయమేమిటి, దీని పనితీరు, ట్రంప్​కి ఎదురయ్యే ఇబ్బందులు ఏవైనా ఉన్నాయేమో తెలుసుకుందాం.

  • సెనేట్​లో విచారణ సుప్రీం కోర్టు చీఫ్​ జస్టిస్​ జాన్​ రాబర్ట్స్​ నేతృత్వంలో జరుగుతుంది. దీనిలో సెనేటర్లు జ్యూరీగానూ, జడ్జిలుగానూకూడా వ్యవహరిస్తారు. దిగువ సభ స్పీకర్​ నాన్సీ పెలోసీ రిప్రజెంటేటివ్స్​ హౌస్​ నుంచి ఇంపీచ్​మెంట్​ మేనేజర్లుగా కొందరు డెమొక్రాట్లను సెలక్ట్​ చేస్తారు.
  •  సెనేటర్లదే పైచేయి. ఎవరైనా సెనేటర్​ సుప్రీం సీజేతో విభేదించి ఓటింగ్​కి డిమాండ్​ చేయవచ్చు.
  • సాక్షులను సెనేటర్లు రాతపూర్వకంగా ప్రశ్నించాలి.
  •  సెనేట్​లో విచారణను రిప్రజెంటేటివ్స్​ సభ నుంచి వచ్చిన ఇంపీచ్​మెంట్​ మేనేజర్లే ఆరంభిస్తారు. ఆర్గ్యుమెంట్​ని వాళ్లే ముగిస్తారు. అంటే ఫస్ట్​ అండ్​ లాస్ట్​ వర్డ్స్​ నేరారోపణ చేసినవాళ్లవే ఉంటాయి.
  • ట్రంప్​ దిగిపోవాలంటే మూడింట రెండొంతుల ఓట్లు ఇంపీచ్​మెంట్​కి అనుకూలంగా రావాలి. 100 మంది సభ్యుల సెనేట్​లో 66 మంది ఓటేయాలి. ఈ లెక్కన 54 మంది రిపబ్లికన్లలో 20 మంది, ఇద్దరు ఇండిపెండెట్లు డెమొక్రాట్లవైపు నిలవాలి. క్లింటన్​ ఈ రూల్​ ఆధారంగానే ఇంపీచ్​మెంట్ నుంచి బయటపడ్డారు. అదే విధంగా ఇప్పుడు ట్రంప్​ కూడా తప్పించుకుంటారని చెబుతున్నారు.
  • ఆర్గ్యుమెంట్లను ముగించి, ఫైనల్​ ఓటింగ్​కి వెళ్లాలన్నా సెనేట్​లో మెజారిటీ ఓటు పడాలి. ఆ విధంగా చూసినా ట్రంప్​కి ఢోకా లేదు.
  • ఇండియాలోవలె బటన్​ నొక్కడం, లేదా  స్పీకర్​ అడిగినప్పుడు ‘అవును లేదా కాదు’ అని చెప్పడం అనే పద్ధతి ఉండదు. సెనేటర్లు వాళ్ల వాళ్ల సీట్లలోనే కూర్చుని తమ అభిప్రాయం చెప్పడంద్వారా ఓటును నమోదు చేస్తారు.

‘వాటర్​ గేట్’​తో దిగిపోయిండు

How Impeachment Works in the Senate is..అమెరికా 37వ ప్రెసిడెంట్​ రిచర్డ్​ నిక్సన్​. 1969లో మొదటిసారి, 1973లో రెండోసారి రిపబ్లికన్​ పార్టీ తరఫున అమెరికా ప్రెసిడెంట్​గా ఎన్నికయ్యారు. ఆయన ఫారిన్​ పాలసీలో ఎక్స్​పర్ట్​, అమెరికాని ఆయిల్​ సంక్షోభం నుంచి బయటపడేసిన ఆర్థికవేత్త, అరబ్​ దేశాలను కాదని ఇజ్రాయెల్​కి ఆయుధాలు పంపించిన సాహసి… అయితేనేం, ఇంపీచ్​మెంట్​కి గురై రాజీనామా చేయాల్సి వచ్చింది.  ఆయన సెకండ్​ టర్మ్​ ఆరంభమైన కొత్తలోనే వాటర్​గేట్​ స్కాం బయటపడింది. 1972–74 మధ్య కాలంలో పొలిటికల్​ అపోనెంట్ల వ్యూహాలు తెలుసుకోవడంకోసం వాళ్ల ఆఫీసుల్లో రహస్యంగా మైక్​లు ఏర్పాటు చేయించారు​. వీటిద్వారా ఎన్నికల్లో ఎటువంటి వ్యూహాలు పన్నుతున్నారో వినడానికి వీలయ్యేది. వాటర్​గేట్​ ఆఫీసు బిల్డింగ్​ (వాషింగ్టన్​)లోని డెమొక్రటిక్​ నేషనల్​ కమిటీ (డీఎన్​సీ) హెడ్​ క్వార్టర్స్​లో నిక్సన్​ ఆదేశాలతో అయిదుగురు వ్యక్తులు ఈ పనులకు పాల్పడినట్లు రుజువైంది.  ‘డీప్​ త్రోట్​’ చెప్పిన కథనంగా ఇద్దరు వాషింగ్టన్​ పోస్ట్​ విలేకరులు ‘వాటర్​గేట్​ స్కాం’ని రిపోర్ట్​ చేశారు. ఇంపీచ్​మెంట్​ మోషన్​ ప్రవేశపెట్టడంతో…  ఓడిపోతానని, పదవిని వదిలేయాల్సి వస్తుందని ముందే గ్రహించిన నిక్సన్​ రాజీనామా చేసేశారు. 1789లో ఫస్ట్​ ఫ్రెసిడెంట్​ జార్జి వాషింగ్టన్​ నుంచి ఇప్పటి ట్రంప్​ వరకు… ఈ 230 ఏళ్లలోనూ ఇంపీచ్​మెంట్​ రుచిచూసి రాజీనామా చేసిన ఏకైక ప్రెసిడెంట్​గా నిక్సన్​ చరిత్రలో నిలిచిపోయారు.