- వారానికి 90 గంటలు పనిచేయాలన్న ఎల్‌అండ్ టీ చైర్మన్ సుబ్రమణియన్
న్యూఢిల్లీ: ‘ఇంట్లో కూర్చోని ఏం చేస్తావ్? ఎంత టైమ్ నీ భార్యను చూస్తావ్? ఎంత టైమ్ నీ భర్తను చూస్తావ్? ఆఫీస్‌కు రా, పని మొదలు పెట్టు’ అంటూ ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రమణియన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
వారానికి 90 గంటలకు పైగా పనిచేయాలని వీడియో కాన్ఫరెన్స్‌లో తన ఉద్యోగులకు ఆయన చెబుతున్న వీడియో వైరల్ అయ్యింది. ఆదివారం కూడా పనిచేయగలిగితే మరింత సంతోష పడతానని, ఎందుకంటే తాను కూడా ఆదివారం పనిచేస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
వారానికి కనీసం 70 గంటలు పనిచేయాలని కామెంట్స్ చేసిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి, సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఆయనకు సుబ్రమణియన్ మద్ధతుగా నిలిచారు. ఇంకా 20 గంటలు ఎక్కువ పని చేయాలని పిలుపిచ్చారు.
ALSO READ : టీసీఎస్ లాభం రూ.12,380 కోట్లు..ఒక్కో షేరుకు 76 రూపాయల డివిడెండ్
అసాధారణమైన ఫలితాలు రావాలంటే, అంతే స్థాయిలో కష్టపడాలని అన్నారు. ఇండియాను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలంటే అందరూ కలిసి పనిచేయాలని పేర్కొన్నారు. సుబ్రమణియన్ కామెంట్స్‌కు బాలీవుడ్ నటి దీపిక పదుకొణె స్పందించారు.
‘సీనియర్ పొజిషన్‌లో ఉండి ఇలాంటి కామెంట్స్ చేయడం ఆశ్చర్యంగా ఉంది. #మెంటల్‌హెల్త్‌మ్యాటర్స్’ అంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.