రూ.1 వెయ్యి, 2 వేలు, 3 వేలు.. SIPతో కోటి రూపాయల రిటర్న్ రావడానికి ఎన్నాళ్లు పడుతుంది?

కోటీశ్వరులు కావాలనే కలలు అందరికీ ఉంటాయి. కొందరు పద్ధతి ప్రకారం పెట్టుబడి పెట్టి పేద, మద్య తరగతి బార్డర్ లైన్స్ దాటి కోటీశ్వరులుగా మారుతుంటారు. కొందరికి ఎంత సంపాదించినా.. ఎంత కష్టపడి పనిచేసినా డబ్బులు కూడబెట్టడం తెలియక.. అక్కడే ఉండిపోతారు. అయితే మ్యుచువల్ ఫండ్స్, స్టాక్స్, ఈటీఎఫ్ ఫండ్స్ తదితర ఇన్వెస్ట్ మెంట్ల ద్వారా చాలా మంది గోల్ రీచ్ అవుతున్నారు. 

అయితే మ్యుచువల్ ఫండ్స్ లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్ మెంట్ (SIP) చేస్తే కోటీశ్వరులన చేస్తామని చాలా కంపెనీలు ప్రకటిస్తుంటాయి. ఈ విషయంలో ఎంతో మంది కోట్ల రూపాయల రిటర్న్స్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు ఫైనాన్షియల్ నాలెడ్జి పెరగడంతో అందరూ ఇన్వెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 

అందులో భాగంగానే ఇండియాలో SIP ట్రెండ్ బాగా నడుస్తోంది. రీటెయిలర్స్ మనీ ఇప్పుడు ఎక్కువ శాతం SIP పెట్టుబడుల్లోకి ట్రాన్స్ ఫర్ అవుతోంది. స్టాక్ మార్కెట్ ఎంత నష్టాల్లో ఉన్నప్పటికీ మ్యుచువల్ ఫండ్ పెట్టుబడులు పెరుగుతూనే ఉన్నాయి. SIP పెట్టుబడులు 2024 నవంబర్ లో  రూ.25,320 ఉండగా, 2024 డిసెంబర్ లో రూ.26,459కి చేరుకుందంటే SIP పెట్టుబడులు ఎంతలా పెరిగిపోయాయో అర్థం చేసుకోవచ్చు. అయితే తక్కువ ఇన్వెస్ట్ మెంట్ రూ.1000, 2 వేలు, 3 వేలు, 5 వేలు ఇన్వెస్ట్ చేసి కోటి రూపాయలకు చేరుకోవడానికి ఎన్నేళ్లు పడుతుందో చూద్దాం.

SIPతో కోటి రూపాయలు రిటర్న్ రావడానికి ఎన్నాళ్లు పడుతుంది?

1. నెలకు రూ.1,000 SIP.. ఏడాదికి 10% పెంచుకుంటూ పోతే:

నెలకు రూ.1,000 SIP చేస్తూ.. ప్రతి ఏడాదికి 10% పెంచుకుంటూ పోతే 12 శాతం వార్షిక (Yearly) రిటర్న్ తో కోటి రూపాయలు రావడానికి 31 సంవత్సరాలు పడుతుంది. మన SIP పెట్టుబడి మొత్తం రూ. 21.83 లక్షలు అయితే.. మనకు అదనంగా వచ్చే రిటర్న్ రూ. 79.95 లక్షలు. ఏడాదికి 10% పెంచడం అంటే.. 1000 లో 10% అంటే 100 రూపాయలు. అంటే రెండో ఏడు రూ.1100 SIP చేయడం. అలా ప్రతి ఏడాదికి 10% పెంచుకుంటూ పోతాం.

2.  నెలకు రూ.2,000 SIP.. ఏడాదికి 10% పెంచుకుంటూ పోతే:

నెలకు రూ.2,000 SIP చేస్తూ.. ప్రతి ఏడాదికి 10% పెంచుకుంటూ పోతే 12 శాతం వార్షిక రిటర్న్ తో 27 సంవత్సరాలకు రూ. 1.15 కోట్ల రూపాయల రిటర్న్ వస్తుంది. మన SIP పెట్టుబడి మొత్తం రూ. 29.06 లక్షలు అయితే.. మనకు అదనంగా వచ్చే రిటర్న్ రూ. 85.69 లక్షలు. 

3.  నెలకు రూ.3,000 SIP.. ఏడాదికి 10% పెంచుకుంటూ పోతే:

నెలకు రూ.3,000 SIP చేస్తూ.. ప్రతి ఏడాదికి 10% పెంచుకుంటూ పోతే 12 శాతం వార్షిక రిటర్న్ తో 24 సంవత్సరాలకు రూ. 1.10 కోట్ల రూపాయల రిటర్న్ వస్తుంది. మన SIP పెట్టుబడి మొత్తం రూ. 31.86 లక్షలు అయితే.. మనకు అదనంగా వచ్చే రిటర్న్ రూ. 78.61 లక్షలు. 

4.  నెలకు రూ.5,000 SIP.. ఏడాదికి 10% పెంచుకుంటూ పోతే:

నెలకు రూ.5,000 SIP చేస్తూ.. ప్రతి ఏడాదికి 10% పెంచుకుంటూ పోతే 12 శాతం వార్షిక రిటర్న్ తో కేవలం 21 సంవత్సరాలకు రూ. 1.16 కోట్ల రూపాయల రిటర్న్ వస్తుంది. మన SIP పెట్టుబడి మొత్తం రూ. 38.40 లక్షలు అయితే.. మనకు అదనంగా వచ్చే రిటర్న్ రూ. 77.96 లక్షలు. 

ఇంకేంటి మరి.. తక్కువ టైమ్, తక్కువ పెట్టుబడితో కోటీశ్వరులు కావాలనే లక్ష్యా్న్ని సులువుగా చేరుకోండి. SIP చేయడానికి మంచి రిటర్న్స్ ఇచ్చే మ్యుచువల్ ఫండ్ ను ఎంచుకోండి. ఫండ్ మేనేజర్ లేదా ఇతర ఎక్స్ పర్ట్ ల సలహా తీసుకొని మీ ఇన్వెస్ట్ మెంట్ జర్నీ స్టా్ర్ట్ చేయండి.