జార్ఖండ్ రైలు ప్రమాదంపై స్పందించారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. దేశంలో ఇంకెన్నీ ప్రమాదాలు జరుగుతాయని ప్రశ్నించారు. ప్రతి వారం ఏదో ఒక చోట రైలు ప్రమాదం జరుగుతుందని.. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి అంతం ఉండదా అని ట్వీట్ చేశారు. చక్రదర్ పూర్ లో జరిగిన రైలు ప్రమాదం ఇద్దరు మరణించగా.. పలువురికీ తీవ్రగాయాలు అయ్యాయన్నారు.
ఇవాళ తెల్లవారు జామున జార్ఖండ్ రైలు ప్రమాదం జరిగింది. చక్రధర్ పూర్ దగ్గర గూడ్స్ రైలు పట్టాలు తప్పి మరో ట్రాక్ పైకి ఒరిగాయి బోగీలు. ఇదే ట్రాక్ లో వస్తున్న హౌరా-ముంబై రైలు...గూడ్స్ రైల్ బోగీలను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మొత్తం 18బోగీలు తప్పాయి. ఏడుగురికి గాయాలు కాగా వారిని హాస్పిటల్ కు తరలించారు. రెండు ట్రాక్ లపై బోగీలు చెల్లచెదురుగా పడిపోవడంతో.. ఆయా రూట్లలో రైలు సర్వీసులను రద్దు చేశారు. బాధితుల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు రైల్వే అధికారులు.