ఆధ్యాత్మికం: పూజలో దేవుడికి ఎన్ని అగర్​ బత్తీలు వెలిగించాలి..

ఆధ్యాత్మికం: పూజలో దేవుడికి ఎన్ని అగర్​ బత్తీలు వెలిగించాలి..

హిందువులు దేవుడిని ఆరాధించే విషయంలో ఎలా పూజ చేయాలి.. ఏ పూజకు ఎన్ని అగర్​ బత్తీలు వెలిగించాలి. అవి ఏదిక్కున పెట్టాలి.  ఇలాంటి ప్రశ్నలతో  సతమతమవుతుంటారు.  అసలు దేవుడికి ఎన్ని అగర్​ బత్తీలు వెలిగించాలో భారత వాస్తు విజ్ఞాన సర్వజ్ఞ, ఆలయ బ్రహ్మ కాశీనాథుని సుబ్రహ్మణ్యం సూచనలు ఒకసారి తెలుసుకుందాం. . 

ప్రశ్న:  అగర్బత్తీలకూ లెక్క ఉంటుందా?  రోజూ ఉదయం దీపారాధన చేసే సమయంలో దేవుడికి అగర్ బత్తీలు వెలిగించడం అలవాటుగా ఉంటుంది. అలాగే కొంతమంది వారానికి  రెండుసార్లు సాంబ్రాణీ కడ్డీలు  పెడుతుంటారు.  కొంతమంది ఇంట్లో దేవుడికి వెలిగించే అగర్బత్తీలకు ఒక లెక్క ఉంటుందని.. ఇష్టమొచ్చినట్టు ఎన్నంటే అన్ని పెట్టొద్దని చెబుతుంటారు. . కేవలం బేసి సంఖ్యలోనే వాటిని వెలిగించాలంటారు. అసలు సాంబ్రాణీ కడ్డీలు పెట్టడం మంచిదేనా? .. ఎన్ని అగర్​ బత్తీలు వెలిగించాలి. భారత వాస్తు విజ్ఞాన సర్వజ్ఞ, ఆలయ బ్రహ్మ కాశీనాథుని సుబ్రహ్మణ్యం గారి సమాధానం తెలుసుకుందాం. 

జవాబు:  ప్రస్తుతం బయట రోజుకోరకంగా చెప్తున్నారు తప్ప... అసలు దేవుడికి వెలిగించే అగర్ బత్తీలకు లెక్క లేదు. ఎప్పుడైనా ఇంట్లో దుష్ప్రభావాలు ఉన్నట్లు అనుమానంగా అనిపిస్తే.. సాయంత్రం ఆరు గంటలకు సాంబ్రాణీ కడ్డీలు, గుగ్గిలం లాంటి వాటితో పొగ వేయడం మంచిది కానీ వాటికీ లెక్క ఏమీ ఉండదు. 

–వెలుగు, లైఫ్​–