
ప్రతి ఇంటికి కిటికీలు.... తలుపులు ఉంటాయి. కాని వాస్తు ప్రకారం ఎన్ని కిటికీలు ఉండాలి.. ఎన్ని తలపులు ఉండాలి. అవి ఓపెన్చేసేటప్పుడు ఎలా ఉండాలి.. వీటి విషయంలోభారత వాస్తు విజ్ఞాన సర్వజ్ఞ, ఆలయ బ్రహ్మ కాశీనాథుని సుబ్రహ్మణ్యం ఏమంటున్నారో తెలుసుకుందాం. .
కిటికీ రెక్కలు ఎలా తెరుచుకోవాలి?
ప్రశ్న: గతంలో ఇంట్లో తలుపులు, కిటికీలు బేసి సంఖ్యలో ఉన్నాయి. ఇంట్లో అనేక సమస్యలు రావడంతో... కొంతమంది పండితుల సూచనలతో కిటికీలు, తలుపులు సరి సంఖ్యలోనే ఉండాలని చెప్పారు. అయినా సమస్యలు పరిష్కారం కావడం లేదు. దీనికి వాస్తు పరంగా ఎలాంటి మార్పులు చేయాలి?
జవాబు: కిటికీలు, తలుపులు ఎప్పుడూ సరి సంఖ్యలోనే ఉండాలి. కొత్త కిటికీలు పెట్టించి మంచి పని చేశారు. అయితే అలా చేసినా మీ సమస్యలు తీరట్లేదంటే... ఇంకో విషయం ఇక్కడ గమనించాలి. కిటికీలు, దర్వాజా తలుపులు ఇంటి లోపలికి తెరుచుకో వాలి. ఇవి మాత్రమే కాదు, గేట్లు కూడా లోపలికే తెరుచుకోవాలి కానీ బయటికి కాదు.
ఎందుకంటే బయటికి తెరుచుకోవడం వల్ల ఇంట్లో లక్ష్మి బయటికి పోతుందని చెప్తారు. వీలైనంత వరకు లోపలికే మంచిది. కానీ మరీ కుదరని చోట బయటికి ఉన్నా పెద్ద నష్టమేమీ జరగదు. అలాగే కిటికీలకు రెండు రెక్కలు ఉంటేనే మంచిది. కానీ తలుపులకు ఎలా ఉన్నా పర్వాలేదని వాస్తు నిపుణులు కాశీనాథుని సుబ్రహ్మణ్యం అంటున్నారు.