ఆధ్యాత్మికం: మౌనం ఎన్ని రకాలు.. ధ్యానం వల్ల కలిగే లాభాలు ఇవే..

ఆధ్యాత్మికం: మౌనం ఎన్ని రకాలు.. ధ్యానం వల్ల కలిగే లాభాలు ఇవే..

పూర్వ కాలంలో చాలామంది మౌన వ్రతం పాటించేవారు.   అయిదు శాంతులలో మౌనం ముఖ్యమైనదిగా చెబుతారు. ‘మాట వెండి, మౌనం బంగారం’ అని సామెత. ‘మాట్లాడటం ద్వారా శక్తిని వృథా చేసుకునేకంటే మౌనంగా ధ్యానం చేయడం వల్ల ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవచ్చు’ అన్నారు స్వామి వివేకానంద.   మౌనం ఎన్ని రకాలో ఇప్పుడు తెలుసుకుందాం. . .

వాక్కును నియంత్రించడమే మౌనం. ఇదొక అద్భుతమైన తపస్సు. మాటలను వృథాగా వినియోగించకుండా అవసరం మేరకే వినేవారికి ఇంపుగా, హితంగా, మితంగా మాట్లాడాలని, అలా చేతకానప్పుడు మౌనమే మేలని విదురనీతి వివరిస్తోంది.  మాట వెండి, మౌనం బంగారం’ అని సామెత.   ‘మాట్లాడటం ద్వారా శక్తిని వృధా చేసుకునేకంటే మౌనంగా ధ్యానం చేయడం వల్ల ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవచ్చు’ అన్నారు స్వామి వివేకానంద.

మౌనం మూడు రకాలు..

వాగ్శౌనం వాక్కుని నిరోధించడమే వాగ్నౌను. దీనినే మౌనవ్రతం అంటారు. ఇలాంటి మౌనం వల్ల కఠినంగా మాట్లాడటం, అబద్దాలాచటం, చాడీలు చెప్పడం, పరనింద చేయటం, అసందర్భ వ్యర్థ ప్రేభాషనలు రేయటం వంటి వాగ్దోషాలు అన్నీ హరిస్తాయి. దీనిని మహాత్మాగాంధీ ప్రాక్టీస్ చేశారు. 

అక్షర మౌనం- అంటే ఇంద్రియాలను నిగ్రహించడమే.  ఈ మౌనంలో కళ్లు, చేతులు, కాళ్లు వంటి ఇంద్రియాలతో సైగలు చేయకుండా. అక్షరాలు రాయకుండా ఏకాగ్రనిష్ఠలో ఉంటారు. ఇలా ఇంద్రియాల శక్తి కోల్పోకుండా చేస్తే ఆ శక్తిని ధ్యానానికి, వైరాగ్యానికి సహకరించేలా చేయొచ్చు. 

కాష్టమౌనం- దీన్నే మానసిక మౌను అంటారు. మౌనధారణలో కూడా. మనసు ఇష్టమొచ్చినట్టు అనేక మార్గాల్లో ప్రయాణిస్తుంది. దానికి అడ్డుకట్ట వేసినప్పుడే కాణానికి మార్గం తలుపులు తెరుచు కుంటాయి. మనసుని నిర్మలంగా ఉంచడమే దీని అసలు ఉద్దేశం. అందుకే దీన్ని మానసిక తపస్సు అన్నారు. కాష్టమౌనంలో మనసు దైవచింతన లేదా ఆత్మానస్వరూప సంధానమయ్యే నిష్టలో పెట్టి క్రమ క్రమంగా పరిపూర్ణ మౌనస్థితికి తీసుకెళ్తారు. ఈ మౌనం వల్లే ఆత్మసాక్షాత్కారం అవుతుంది. 

'గొంతు మౌనంగా ఉన్నప్పుడు మనను మాట్లాడుతుంది. మనను మౌనంగా ఉన్నప్పుడు హృదయం మాట్లాడుతుంది. హృదయం మౌనమైనప్పుడు అంతరాత్మ అనుభూతుని తెస్తుంది" అని 40 ఏళ్లు కార్యమౌనదీక్షలో గడిపిన శ్రీ మెహర్ బాబా చెప్పారు.

ALSO READ | Kamika Ekadashi: పరమేశ్వరుడు భూలోకంలో విహరించే రోజు ఇదే..

భక్తుని మౌనం.. మాటల్లేని ప్రార్థన. ఆధ్యాత్మిక సాధనకు మౌనమే మొదటి పాదం. సాధనలో మనసు మాట అంగాలి. అంత:కరణశుద్ధి జరగాలి. అప్పుడే, అక్కడే 'మౌనం' మొదలవుతుంది. ఈ మౌనం మంచే జ్ఞానం ఉదయిస్తుంది. మౌనానుభూతే అసలు సిసలైన పరిపూర్ణ జ్ఞానం. ఈ జ్ఞానమే ముక్తిని ప్రసాదిస్తుంది. అంతరంగాన్ని ప్రబోధిస్తుంది.. అంతర్ముఖ ప్రయాణం చేయిస్తుంది. అంతర్యామినిదర్శింపజేస్తుంది. అంతరాత్మని ఆవిష్కరిస్తుంది.. ఆత్మసాక్షాత్కారం కావిస్తుంది.

ధ్యానానికి మౌనమే పునాది. బహిర్గతంగానే కాదు, అంతర్గతంగానూ మౌనం పాటించనిదే ధ్యానం చేయడం అసాధ్యం. నిరంతర యోగసాధకులైన మహర్షులు మౌనంగా ధ్యానం కొనసాగిస్తారు.   రోజూ అరగంట మౌనంగా ఉంటే శారీరక, మానసిక ఆరోగ్యం సిద్ధించడంతో పాటు ఆశలు, ఆశయాలు, కలలు, కోరికలు నెరవేరతాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. మౌనంగా ఉండటమంటే ఇంట్లో పనులు చేస్తూ,  టీవీ కార్యక్రమాలు చూస్తూ, కంప్యూటర్‌ ముందు కూర్చుని అంతర్జాలం చూడటం కాదు. కళ్లు మూసుకుని మాటను, మనసును మౌనంలోకి జార్చేస్తే మనసు తేలిగ్గా ఉంటుంది. ఎంతో మంది అనుభవపూర్వకంగా చెబుతున్న విలువైన మాట ఇది.