Pushpa 2 OTT: రికార్డు స్థాయిలో పుష్ప 2 OTT హక్కులు.. నెట్‌ఫ్లిక్స్ ఎన్ని కోట్లు చెల్లించిందంటే?

Pushpa 2 OTT: రికార్డు స్థాయిలో పుష్ప 2 OTT హక్కులు..  నెట్‌ఫ్లిక్స్ ఎన్ని కోట్లు చెల్లించిందంటే?

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 (Pushpa 2) మరికొన్ని గంటల్లో (జనవరి 30న) ఓటీటీలోకి రానుంది. ఈ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్‌(Netflix) ఓ వీడియో రిలీజ్ చేసింది. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం మరియు తమిళంలో పుష్ప 2 అందుబాటులో ఉంటుందని తెలిపింది.

అలాగే పుష్ప2 రీలోడెడ్ వెర్షన్ తీసుకొస్తున్నట్టు నెట్‍ఫ్లిక్స్ మరోసారి కన్ఫర్మ్ చేసింది. దాంతో సినిమా 3 గంటల 44 నిమిషాల రన్‍టైమ్ ఉండనుంది. అయితే, థియేటర్లో వసూళ్ల తాండవం సృష్టించిన పుష్ప గాడి రూల్.. ఓటీటీ ప్లాట్ఫామ్లో ఎలాంటి ధర పలికిందో ఆ లెక్కలు చూద్దాం. 

పుష్ప 2 ఓటీటీ హక్కులు:

పుష్ప 2 హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఏకంగా రూ.275 కోట్లకు స్ట్రీమింగ్ హక్కుల్ని కైవసం చేసుకుందని టాక్. అయితే, ఈ సినిమా రిలీజ్ కాకముందే ఇంతటి భారీ స్థాయి రేటుతో హక్కులు దక్కించుకోవడం విశేషం. ఓటీటీ హక్కుల ద్వారా అత్యధిక ధర దక్కించుకున్న ఇండియన్ మూవీగా పుష్ప 2 రికార్డు కూడా క్రియేట్ చేసింది.

పుష్ప 2 కలెక్షన్స్:

దాదాపు రూ.400-500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన పుష్ప 2 మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇండియాలో ఈ మూవీ రూ.1228.9 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. 32 రోజుల్లో (జనవరి 6) వరకు పుష్ప 2.. వరల్డ్ వైడ్ గా రూ.1832 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు మైత్రి మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక అప్పటినుంచి ఎలాంటి వసూళ్ల అప్డేట్ పోస్టర్ విడుదల చేయలేదు. అయితే, మొత్తానికి సుమారు రూ.1850కోట్ల గ్రాస్ చేసినట్లు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి.